📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Telugu news: CM Revanth: జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

Author Icon By Tejaswini Y
Updated: December 9, 2025 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లిని ప్రతిబింబించే విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) ఆవిష్కరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన నమూనాను అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో ఈ విగ్రహాలు నిర్మించబడ్డాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా, అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 5.80 కోట్లు కేటాయించింది.

Read Also: TG Weather: తెలంగాణలో దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణ జిల్లాల్లో తల్లి ప్రతిమ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) సూచనల మేరకు తెలంగాణ తల్లి ప్రతిమను పల్లెటూరి మహిళా రైతు రూపంలో రూపొందించారు. ఆకుపచ్చ చీరకు పసుపు అంచు, నుదుటిపై ఎర్ర బొట్టు, కాళ్లకు కడియాలు, ముక్కుపుడక, మట్టి గాజులు, గుండు పూసల హారం వంటి సంప్రదాయ ఆభరణాలతో విగ్రహాన్ని అలంకరించారు. ఎడమ చేతిలో మొక్కజొన్న, గోధుమ, సజ్జ కంకులను పట్టుకొని చిరునవ్వుతో నిలబడిన రూపంలో విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

Telangana Thalli

భూమి నుంచి మొత్తం 18 అడుగుల ఎత్తులో (12 అడుగుల విగ్రహం + 6 అడుగుల దిమ్మె) ఈ ప్రతిమలను నిర్మించారు. ఒక్కో విగ్రహం తయారీకి సుమారు రూ. 17.50 లక్షల వ్యయం అయ్యింది. డిసెంబర్ 9వ తేదీని ప్రభుత్వం “తెలంగాణ తల్లి దినోత్సవం”గా జరుపుకోవాలని నిర్ణయించగా, దాని భాగంగా ఈ ఆవిష్కరణలు నిర్వహించబడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

District Collectorate Revanth Reddy Statue Unveiling telangana cm Telangana Culture telangana thalli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.