తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మరింత నాణ్యమైన, పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయనున్న అక్షయపాత్ర ఫౌండేషన్ గ్రీన్ ఫీల్డ్ కిచెన్‌కు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు.
Read Also: Vegetables Prices: పెరిగిన కూరగాయల ధరలు!
ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా నడుస్తోంది
కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికే 316 ప్రభుత్వ పాఠశాలల్లో హరే కృష్ణ మూవ్‌మెంట్‌కు చెందిన సంస్థ విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయపు అల్పాహారం అందిస్తోంది. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు.
పిల్లల్లో హాజరు శాతం పెరగడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం, చదువుపై ఆసక్తి పెరగడం వంటి పాజిటివ్ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి కూడా ఇదే మోడల్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: