తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఇవాళ ఉదయం 10 గంటలకు ఢిల్లీ (Delhi) బయలుదేరనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన నేతలతో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో కొత్తగా ఎంపికైన మంత్రులకు శాఖల కేటాయింపు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (PCC) కార్యవర్గం సమీకరణపై చర్చ జరగనుంది. అలాగే వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్‌ల నియామకం కూడా ఈ భేటీలో ప్రధాన అంశంగా ఉండనుంది.
ఎస్సీ వర్గీకరణ, బీసీ గణనపై భారీ సభల ప్రణాళిక
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, పార్టీ మద్దతు పెంచేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ భారీ బహిరంగ సభల ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన అంశాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ సభలు ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలన్నదిపై ఈరోజు ఢిల్లీలో స్పష్టత రానుందని సమాచారం.
పార్టీ శ్రేణుల్లో ఆసక్తి
ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. శాఖల కేటాయింపు విషయంలో కొంత అసంతృప్తి కనిపిస్తున్న నేపధ్యంలో, అధిష్ఠానం నడుపుతున్న తీరుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్రంలో పాలన సంబంధిత చర్యలే కాకుండా రాజకీయంగా కూడా పలు కీలక అభివృద్ధులు జరగనున్నాయని అంచనా.
Read Also : Teachers Strikes : నేటి నుంచి ఏపీలో టీచర్ల నిరాహార దీక్షలు