📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

CM Revanth comments: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ బెయిల్‌పై రేవంత్ రెడ్డి స్పందన

Author Icon By Pooja
Updated: March 18, 2026 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై కీలక వివరణ ఇచ్చారు. ఈ ఉదంతంలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ లభించడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. చట్టపరమైన నిబంధనల ప్రకారమే పోలీసుల ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇందులో రాజకీయ జోక్యం లేదని సీఎం వెల్లడించారు. ఈ కేసులో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Read Also: Drugs Case CM Comments: మొయినాబాద్ కేసుపై చంద్రబాబు సీరియస్; ఎంపీ పుట్టా మహేష్‌కు షాక్!

CM Revanth: Revanth Reddy’s Reaction to the MP’s Bail in the Moinabad Drugs Case

డ్రగ్స్ వ్యవహారంలో ఉన్న నిజానిజాలను బయటకు తీసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఫామ్‌హౌస్‌లు వేదికగా జరుగుతున్న మాదకద్రవ్యాల పార్టీలు, అంతర్రాష్ట్ర గ్యాంగ్‌స్టర్ల ప్రమేయం ఉన్న సెటిల్‌మెంట్లపై లోతైన దర్యాప్తు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. నేరస్థులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు.

3 నెలల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని సీఎం రేవంత్ ఆదేశం

ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, వచ్చే మూడు నెలల్లోగా సమగ్రమైన చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేయాలని సిట్ అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన గడువు విధించారు. డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

MoinabadDrugsCase PuttaMahesh RevanthReddy SITInvestigation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.