తెలంగాణలో త్వరలోనే కేబినెట్ మార్పులు చోటుచేసుకోనున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా పనితీరు సరిగా లేని కొందరు మంత్రులపై గంభీరంగా దృష్టిసారించిన అధిష్టానం, వారిని పదవుల నుండి తప్పించే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రుల పనితీరుపై సిద్దమైన నివేదిక హైకమాండ్‌కి చేరిందని సమాచారం. ఈ నివేదికపై సమీక్షా సమావేశం త్వరలో నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.పనితీరు మెరుగుపరచకపోతే పదవి వేటు తప్పదనే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Read Also: CMO: ఏపీ సచివాలయాల పేరును మార్చలేదు: సీఎంఓ
అదే సమయంలో, కేబినెట్‌లో చోటు కోసం సీనియర్ నేతల లాబీయింగ్ కూడా బాగా జోరుగా సాగుతోంది. బీసీ కోటాలో మంత్రి పదవుల కోసం మధు యాష్కి, అంజన్‌కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య వంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఎస్టీ కోటాలో ఎమ్మెల్యేలు బాలు నాయక్, రామచంద్రునాయక్ పేర్లు వినిపిస్తున్నాయి.
బీసీ వర్గాన్ని ఆకట్టుకునే కొత్త వ్యూహం
బీసీ వర్గానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్ఠానం కొత్త వ్యూహాన్ని రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేబినెట్‌లో మరో ఉప ముఖ్యమంత్రిని నియమించాలనే ఆలోచన హైకమాండ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు, బీసీ వర్గానికి చెందిన నేతకు రెండో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీసీ వర్గం నుంచి ఆశించిన మద్దతు రాకపోవడం, రాష్ట్రంలో ఆ వర్గ జనాభా అధికంగా ఉండటం ఈ నిర్ణయానికి కారణమని సమాచారం. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను కేబినెట్‌లోకి తీసుకుని, పీసీసీ అధ్యక్షుడిగా మరో బీసీ నేతను నియమించే ప్రతిపాదన కూడా తెరపై ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో పొన్నం ప్రభాకర్ పేరు వినిపిస్తోంది.
రిజర్వేషన్లతో బీసీలకు మద్దతు పెంచే ప్రయత్నం
బీసీ వర్గాన్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్ల పెంపునకు (CM Revanth Reddy) ప్రయత్నిస్తోంది. అయితే ఆ ప్రక్రియ ప్రస్తుతం న్యాయపరమైన సమస్యల్లో ఇరుక్కుపోయింది. దీంతో, ప్లాన్–బీగా బీసీ నేతకు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్(Congress) ఆలోచిస్తోంది. తెలంగాణలో అమలు చేయబోయే ఈ వ్యూహాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధంగా కాంగ్రెస్, తెలంగాణను జాతీయ స్థాయిలో రాజకీయ వ్యూహాలకు మోడల్‌గా ఉపయోగించుకోవాలని చూస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: