నేడు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

Read Time:  1 min
CM revanth reddy review with higher officials today
CM revanth reddy review with higher officials today
FONT SIZE
GET APP

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై వివరాలను అధికారుల నుంచి తెలుసుకోనున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం ఇంటింటికి సర్వేలు చేపడుతున్న ప్రభుత్వం.. చాలా వరకు సర్వేను పూర్తి చేసింది. అయితే.. సంక్రాంతి తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్నారు. అంతేకాకుండా.. గత ప్రభుత్వంలో ఉన్న ధరణి పోర్టల్ ని భూభారతిగా మార్చనున్న విషయం తెలిసిందే. అయితే.. భూ భారతిపై కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. నియామక పత్రాలను అందించనున్న ప్రధాని మోడీ అయితే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన భూభారతి బిల్లు, కాస్తు కాలమ్/ అనుభవదారు కాలమ్ ని పునరుద్ధరించడం ద్వారా ఇప్పుడు పెద్ద చర్చ నీయాంశమైంది. దశాబ్దాలుగా భూములు దున్నుకున్న వారి పేర్లు తిరిగి రికార్డుల్లోకి రావడం వల్ల కొన్ని వర్గాలు సంతోషించగా, మరికొన్ని వర్గాలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.