📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

CM Revanth Reddy: చలాన్ పడగానే డబ్బు కట్

Author Icon By Tejaswini Y
Updated: January 13, 2026 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళిక అవసరమని సిఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసు శాఖ పక్కా నివేదిక రూపొందించి అమలు చే యాలని, ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరిమానాల వసూలుకు నంబర్ ప్లేట్లతో బ్యాంకు ఖాతాలు లింక్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళిక అరైవ్, అలైవ్ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

Read also: Oslo: నోబెల్‌ మరొకరికి అంకితం చేయడం కుదరదు: కమిటీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు దేశ వ్యాప్తంగా అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేయడంతో పాటు జిడిపిలో మూడు శాతం నష్టాన్ని చేకూరుస్తుందని తెలిపారు. రాష్ట్రం వరకు వస్తే వీటిని కచ్చితంగా నివారించాల్సిందేనని, ఈ విషయంలో పోలీసు, రవాణా శాఖలు భాగస్వామ్యం అయితే సరిపోదని, ప్రజలు తమ చలాన్ పడగానే డబ్బు కట్ వంతు సహాయం అందించాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ చేబట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం ఎంతో మంచిదని ఆయన కొనియా డారు. దేశంలో ప్రతీ నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని సిఎం తెలిపారు. విద్యార్థి దశ నుంచే రోడ్డు ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్పై అవగాహన కలిగించాలని, తద్వారా విద్యార్థులు భవిష్యత్తులో తప్పిదాలకు దూరంగా వుండే వీలుంటుందని సిఎం అన్నారు.

CM Revanth Reddy: Cut money as soon as the challan is issued

రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చ ంద సంస్థల ప్రతినిధులతో కలిసి పోలీసులు నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమం మెరుగైన ఫలితాలను ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చట్టాలను అమలు చేయాలని సిఎం కోరారు. రోడ్డు ప్రమాదాల అంశాన్ని తమ సర్కారు తీవ్రమైన సమస్యగా భావిస్తోం దని సిఎం తెలిపారు. యుద్ధంలో సైనికుల మరణాల కంటే రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా వుంటోందని ఆయన తెలిపారు. ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఇకముందు ఎలాంటి రాయితీలు, తగ్గింపులు వుండబోవని సిఎం తేల్చిచెప్పారు. చలాన్ల విషయంలో కఠినంగా ఉండాలని, ట్రాఫిక్ చలాన్ల వసూలుకు వాహ నాల నంబర్ ప్లేట్లను వాహనదారుల బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాలని, వాహనంపై చలాన్ పడిన వెంటనే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యేలా చూడాలి, ఎప్పటి చలాన్ల వసూలు అప్పుడే వసూలయ్యే వీలుం టుందని సిఎం తెలిపారు. ట్రాఫిక్ వ్యవస్థ ఆరో వేలుగా తయారయ్యిందని, ఈ విధానం మారాలని ఆయన తెలిపారు.

ట్రాఫిక్ చలాన్ల వసూలుకు సాంకేతికను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. సిగ్నలింగ్, ట్రాఫిక్ వ్యవస్థపై(Traffic Challans) అవగాహన కలిగించి, ట్రాఫిక్ పోలీసు విభాగాన్ని ప్రక్షాళన చే యాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ నియంత్రణను మొదటి ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని, ఇందుకు వెంటనే కసరత్తులు చేయాలని ఆయన ఆదేశించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహనాల యజమానులపై కేసులు నమోదు చేయాలని సిఎం ఆదేశించారు. అనేక అంశాలలో రాష్ట్ర పోలీసు శాఖ దేశానికి రోల్మాడల్గా వుందని సిఎం కొనియాడారు. మారిన పరిస్థితుల్లో పిజికల్ క్రైంతో పాటు సైబర్ నేరాలు పెరిగాయని, అయితే సైబర్ నేరాల నివారణలో తెలంగాణ టాప్ లో వుందని. డ్రగ్స్ కట్టడిలో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో వుందని సిఎం తెలిపారు. రాష్ట్రం లో సైబర్ నేరాల నివారణకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందు కు ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేయగా ఈ రెండు విభాగాలు నేరగాళ్లను వెంటాడి మరీ ప ట్టుకుంటున్నాయని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగితే రాష్ట్రంలో తగ్గడం సై బర్ సెక్యూరిటీ బ్యూరో ఘనతగా సిఎం అభినందించారు. డ్రగ్స్ కట్టడిలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలవడంలో ఈగల్ పోలీసుల కృషి వుం దని సిఎం తెలిపారు. డ్రగ్స్ కట్టడికి ఈగల్ పోలీసులు దేశ వ్యాప్తంగా స్మగర్ల నెట్ వర్పై చేస్తున్న దాడులు ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరు తెచ్చి పెట్టిందని ఆయన తెలిపారు. అయితే సైబర్ క్రైం, డ్రగ్స్ కేసుల కంటే రోడ్డు ప్రమాదాలు తీవ్రమైన అంశంగా మారిందని రేవంత్ రెడ్డి తెలిపారు.

చెరువుల పునరుద్ధరణకు హైడ్రా ఏర్పాటు జంట నగరాలు, శివార్లలో చెరువులు, కుంటల పునరుద్దరణకు హైడ్రాను ఏర్పాటు చేశామని, ఈ విభాగం ఏర్పాటయ్యాక అనేక చెరువులకు జలకళ వచ్చిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆక్రమణలో వున్న అనేక చెరువులను హైడ్రా కాపాడి వాటిలో నీరు వుండేలా చేసిందని, దీనివల్ల ఆయా ప్రాంతాలలో భూగర్భ జలాలు పెరిగాయని ఆయన తెలిపారు. హైడ్రాకు అనేకచోట్ల ప్రజలు స్వచ్చందంగా బ్రహ్మరథం పడుతున్నారని ఆయన తెలి పారు. హైడ్రా వల్ల అనేక చెరువులు, కుంటలకు మళ్ళీ ప్రాణం వచ్చిందని సిఎం తెలిపారు. అంతకు ముందు అరైవ్ అలైవ్కు సంబంధించిన వాల్ పోస్టర్ను సిఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఇదే సమయంలో థీం సాంగ్ను కూడా ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి.వి ఆనంగ్, డిజిపి శివధర్ రెడ్డి, సిటీ కొత్వాల్ సజ్జన్నార్, సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు. వీరితో పాటు స్టేడియంలో భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని హోరెత్తించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Arrive Alive Program CM Revanth Reddy Google News in Telugu Hyderabad News Road Accident Prevention Telangana road safety Traffic Rules Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.