📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

CM Revanth Reddy: జిహెచ్ఎంసీ స్థానంలో కోర్ అర్బన్ చట్టం

Author Icon By Tejaswini Y
Updated: February 28, 2026 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CM Revanth Reddy: అవుటర్ రింగురోడ్డు పరిధిలోని (కోర్ అర్బన్) మూడు కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) చట్టంస్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనుమతులు, రుసుమలు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికి ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులు తొలుత చేపడతామని సీఎం తెలిపారు.

Read Also: Telangana: అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసిన మల్లు భట్టివిక్రమార్క

CM Revanth Reddy: Core Urban Act to replace GHMC

పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం

ఎంఏయూడీపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడి వేయాలో తెలియక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారని.. ముందుగా చెత్త వేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆ తర్వాత నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా ఇష్టారీతిగా ఎక్కడిపడితే అక్కడ చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. కోర్ అర్బన్ ఏరియాలో రోడ్ల నిర్మాణ విషయంలో బాధ్య తాయుతంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు.

ఉపాధిహామీలో రోడ్ల నిర్మాణం నిర్దేశిత కాలం వరకు మళ్లీ వేయడానికి అనుమతులు రావని.. అలాంటి సాంకేతికతను వినియోగించాలని సీఎం సూచించారు. రోడ్డు నిర్మించిన తర్వాత దాని జీవిత కాలం ఎంతనేది నిర్ణయించి.. ఆ లోపు దానిని తొలగించినా… అక్కడ మళ్లీ రోడ్డు వేసినా అందుకు బాధ్యులు ఎవరో తేల్చాలని సీఎం ఆదేశించారు. కోర్ అర్బ న్ ఏరియాలో ప్రతి వీధి దీపం వెలుగుతుందో లేదో డ్యాష్ బోర్డులో కనిపించాలని సీఎం అన్నా రు. ఎక్కడైనా సమస్య ఉంటే దానిని వెంటనే తెలుసుకొని పరిష్కరించాలన్నారు. కోర్ అర్బన్ ఏరియాలో ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నగరంలోని అన్ని హోటళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలని సిఎం ఆదేశించారు. తరచూ తనిఖీలు చేపట్టడంతో పాటు పర్యవేక్షణ కొనసాగాలన్నారు.

కోర్ అర్బన్ ఏరియాలో ఫైర్ సేఫ్టీ

ఫుడ్ సేఫ్టీకి ఆయా హోటళ్లు తీసుకుంటున్న చర్యలను మదింపు చేసి వారికి రేటింగ్స్ ఇవ్వాలని సీఎం సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో ఫైర్ సేఫ్టీకి పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 50 అంతస్తులకు పైగా భవంతులు నిర్మాణాలు జరుగుతున్నా యని. అంత ఎత్తులో అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన అధునాతన సామగ్రి, వాటర్ సాంకేతికతను సమకూర్చుకోవాలని సిఎం సూచించారు. నగరంలోని సర్కిల్స్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలని ఇఎం సూచించారు. అదే సమయంలో యూనిఫోలను ఏర్పాటు చేసి వాటిని మల్టీ యుటిలిటీ పోల్స్ గా ఉపయోగించాలని సీఎం తెలిపారు.

వివిధ యాజమాన్యాల పరిధిలో రోడ్లు ఉండడంతో ఉన్న గందరగోళాన్ని తొలగించాలని పేర్కొన్నారు. పనుల్లో ఏకరూప త, పనుల వేగవంతానికి ఇది తోడ్పడుతుందని సిఎం అన్నారు. నగరంలో వివిధ ప్రదేశాల్లో రద్దీ తగ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ల నమూనాలను అధికారులకు ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన సీఎం పలు సూచనలు చేశారు. చారిత్రాక ప్రాధాన్యం గల కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని.. వాటిని పర్యాటక స్థలాలుగా మార్చాలని సీఎం సూచించారు. భార త్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయా లను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్కడ అవసరమైన అనుమతులు వెంటనే తీసుకోవాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాల పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. నిర్మాణాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలోని పెద్ద చెరువులు, కుంటల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైడ్రా పరిరక్షి ంచిన చెరువుల చుట్టూ కట్టలు కట్టి వదిలి వేయకుండా వాటి రక్షణతో పాటు సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

CM Revanth Reddy Core Urban Act Hyderabad Future City Hyderabad GHMC New Rules Hyderabad Food Safety CC Cameras

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.