📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

CM Revanth Reddy: ఫిల్మ్ ఛాంబర్ సమస్యలను చర్చించి పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

Author Icon By Anusha
Updated: August 20, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద సంక్షోభం నెలకొంది. ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపుతో 17 రోజులుగా కొనసాగుతోన్న సమ్మె కారణంగా అన్ని షూటింగులు పూర్తిగా ఆగిపోయాయి. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి సినిమా ప్రాజెక్ట్ (film project) నిలిచిపోవడం వల్ల నిర్మాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సమ్మె వెనుక ప్రధాన కారణం వేతనాల పెంపు. కార్మికులు తమ వేతనాలను 30 శాతం మేర పెంచాలని పట్టుబడుతుండగా, ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న నిర్మాతలు ఆ డిమాండ్‌ను నెరవేర్చడం సాధ్యం కాదని చెబుతున్నారు.ఇప్పటికే పలుమార్లు ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు సమావేశమైనా ఎటువంటి పరిష్కారం దొరకలేదు. ప్రతి చర్చా విఫలమవుతుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి మధ్యవర్తిత్వం చేసినా ఎటువంటి ఫలితం రాలేదు. సమ్మె విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఇరుపక్షాల మధ్య దూరం మరింత పెరిగింది.

సమస్యకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పరిశ్రమలో సీనియర్లు “ఇలాంటి సమయంలో దాసరి నారాయణరావు లాంటి నేతృత్వం ఉంటే సమస్యలు సులభంగా పరిష్కరమయ్యేవి” అని వ్యాఖ్యానిస్తున్నారు.ఇకపోతే సమ్మె కారణంగా నిర్మాతలకు మాత్రమే కాకుండా, కొత్తగా షూటింగ్‌కి సిద్ధమైన చిన్న సినిమాలకు, సీరియల్స్‌కూ నష్టం కలుగుతోంది. వందలాది మంది చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, డైలీ వేజ్ వర్కర్స్ నిరుద్యోగులుగా మారారు. రోజువారీ ఆదాయంపై బతికే కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.అసలు ఈ సమ్మె ఎన్నాళ్లు కొనసాగుతుంది.. పరిష్కారం దొరుకుతుందాం.. లేదా అన్న సందిగ్థత నెలకొన్న వేళ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రంగంలోకి దిగింది. ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆదేశించారు. గత రెండు వారాలుగా కొనసాగుతోన్న ఈ సమ్మె రాష్ట్ర సినిమా పాలసీపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ని సినిమా హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె పెద్ద అడ్డంకిగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

CM Revanth Reddy

సమ్మెకు ఫుల్‌స్టాప్ పెట్టేలా రంగంలోకి దిగింది

కార్మికుల సమ్మెతో హైదరాబాద్‌లో తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల చిత్రాల షూటింగులు కూడా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా సమ్మెకు ఫుల్‌స్టాప్ పెట్టేలా రంగంలోకి దిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు ఫిల్మ్ ఛాంబర్‌ ప్రతినిధులతో ఇప్పటికే చర్చలు జరిపారు. అలాగే ఫెడరేషన్ నాయకులతో డీజీపీ చర్చలు జరపనున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం 3 గంటలకు నిర్మాతలతో, 4 గంటలకు ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ చర్చలు నిర్వహించనుంది. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఈ సమస్యకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు కార్మికుల వేతనాల పెంపుపై ఫిలిం ఫెడరేషన్‌కి ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాసింది. నాలుగు షరతులతో పాటు పర్సంటేజీ విధానాన్ని అందులో వివరించారు. అయితే నిర్మాతలు పెట్టిన షరతులకు కార్మికుల సంఘం ఒప్పుకుంటుందా? లేదా? అనే విషయంపై క్లారిటీ రావాల్సింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/tamannaah-bold-scenes-are-the-only-way-i-have-more-opportunities/cinema/533289/

Breaking News chiranjeevi support chiru intervention film workers federation strike latest news Telugu Film Industry Telugu News Tollywood Strike

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.