ప్రపంచ స్టార్ ఫుడ్‌బాల్ ప్లేయర్.. లియోనెల్ మెస్సీ ఇండియా టూర్‌కు సిద్ధమయ్యారు. ఈ టూర్‌లో భాగంగా డిసెంబర్ 13న ఆయన హైదరాబాద్ రానున్నారు. అయితే హైదరాబాద్ రానున్న మెస్సీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనున్నారు. మెస్సీతో మ్యాచ్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు.
Read Also: Liquor Sale : రెండేళ్లలో తెలంగాణ లో రూ.71,500 కోట్ల మద్యం తాగేశారు..ఓరి దేవుడా !!
యువతతో కలిసి ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్‌లోపాల్గొన్నారు
ఇందుకోసం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఆయన ప్రాక్టీస్ మొదలు పెట్టారు.రోజంతా కార్యక్రమాలు ముగించుకుని ఆదివారం రాత్రి ఫుట్ బాల్ ఆటగాళ్లతో గ్రౌండ్ లోకి దిగారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth). యువతతో కలిసి ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. సుమారు గంటపాటు ప్లేయర్లతో కలిసి మ్యాచ్ ప్రాక్టీస్ చేశారు.
ఈ మ్యాచ్‌తో హైదరాబాద్ స్పోర్ట్స్ స్పిరిట్‌ను హైలైట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్‌లో భాగంగా రాష్ట్రంలో క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే అనేక నిర్ణయాలను ఆయన తీసుకుంటున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: