చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని(OU Development) ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. వర్సిటీలో మౌలిక వసతులను అంతర్జాతీయ విద్యాసంస్థలకు సరితూగేలా తీర్చిదిద్దేందుకు రూ.1000 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
Read Also: CM Revanth: నర్సంపేటకు ముఖ్యమంత్రి రేవంత్ వరాల జల్లు
ప్రపంచ స్థాయి సదుపాయాలకు సిద్ధమవుతున్న ఓయూ
అభివృద్ధి (OU Development)ప్రణాళికలో భాగంగా వర్సిటీలో పలు ఆధునిక నిర్మాణాలు చేపట్టనున్నారు. వాటిలో:
- ఇంటర్నేషనల్ రీసెర్చి సెంటర్లు
- మెగా హాస్టళ్ల నిర్మాణం
- హైటెక్ అకడమిక్ బ్లాకులు
- సైకిల్ & వాకింగ్ ట్రాక్లు
- క్రీడా వసతులు
- హెల్త్ కేర్ సెంటర్
- కన్వెన్షన్ హాల్
ఈ ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన డీపీర్ సిద్ధం చేయడం కొనసాగుతోంది.
విద్యార్థులు, అధ్యాపకుల అభిప్రాయాలకు ప్రాధాన్యం
సమీక్ష సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) కీలక సూచనలు చేశారు.
- అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, ప్రొఫెసర్ల సూచనలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
- డిజైన్ నమూనాలను విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచాలని సూచించారు.
- వారి అభిప్రాయాలు స్వీకరించేందుకు ప్రత్యేక వెబ్సైట్, డ్రాప్బాక్స్లను ఏర్పాటు చేయాలని తెలిపారు.
- ఓయూ చరిత్ర, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే చిహ్నాలు ఏర్పాటుచేయాలని సూచించారు.
విశ్వవిద్యాలయంలోని చారిత్రక నిర్మాణాలను కాపాడుతూనే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త హాస్టల్ సముదాయాలు ఏర్పాటు చేయాలని సీఎం(CM Revanth) పేర్కొన్నారు. ఓయూ అభివృద్ధికి ఎంత ఖర్చైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించడానికి ఈ నెల 10న ఓయూను సందర్శిస్తానని సీఎం ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: