ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నర్సంపేటలో నిర్వహించిన సభ విజయవంతంగా ముగిసింది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంచనాలకు మించి హాజరయ్యారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి (MLA Donthi Madhav Reddy) అధ్యక్ష ఉపన్యాసం చేసిన అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు పోతున్నామని, అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుందని, నిస్వార్థంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామని ఆయన అన్నారు.
Read Also: CM Revanth: నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్
ఈ సందర్భంగా రేవంత్ (CM Revanth) రెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, మాధవన్న తనను అడగకుండానే అన్ని అడుగుతున్నాడని అన్నారు. “ఒకింత రిక్వెస్ట్ చేసినట్టే చేసి నిధులు, ఇల్లు కావాలంటూ ఆర్డర్ కూడా వేశాడని” అనడంతో సభలో నవ్వులు పూశాయి. మాధవన్న తన వ్యక్తిగత లాభాపేక్షకు కాకుండా నిరుపేదలకు మరో 3 వేల ఇందిరమ్మ ఇళ్లు అడగడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి కొనియాడారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తన కోటా నుంచి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ నుంచి పొంగులేటికి ఆదేశాలు జారీ చేశారు.
మాధవరెడ్డి కోరిన నిధులు మరియు ప్రాజెక్టుల వివరాలు
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన ప్రసంగంలో నర్సంపేటకు ముఖ్యమంత్రి రూ. 1000 కోట్ల నిధులు మంజూరు చేశారని, ఇందులో రూ. 600 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారని తెలిపారు. అదేవిధంగా, నియోజకవర్గానికి ఇంకా అవసరమైన నిధుల వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు:
- యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్: రూ. 200 కోట్లు.
- మెడికల్ కళాశాల: రూ. 150 కోట్లు మంజూరు కాగా, అదనంగా రూ. 12 కోట్లు అవసరం.
- నర్సింగ్ కళాశాల నిర్మాణం: రూ. 26 కోట్లు.
- మున్సిపాలిటీ అభివృద్ధి: రూ. 25 కోట్లు.
- నర్సంపేట పట్టణానికి: రింగ్ రోడ్డు, అండర్ డ్రైనేజీకి నిధులు.
- పాకాల సరస్సు అభివృద్ధి: కాల్వల అభివృద్ధికి రూ. 140 కోట్లు, మొత్తం పాకాల అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు కేటాయించాలని డిమాండ్.
- విద్యుత్: 133 కేవీ సామర్థ్యం గల సబ్ స్టేషన్లు అవసరం.
ఈ సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, గండ్ర సత్యనారాయణ, రాంచందర్ నాయక్, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: