తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) మరో కీలక ప్రకటన చేశారు. త్వరలో రాష్ట్రంలో అదనంగా 40 వేల ఉద్యోగాలను భర్తీ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. హుజురాబాద్‌లో బుధవారం జరిగిన భారీ సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
2023 డిసెంబర్ 3న పది సంవత్సరాల పాలనకు ప్రజలు ముగింపు పలికారని, అదే రోజున శ్రీకాంతాచారి మరణం కూడా చోటుచేసుకుందని గుర్తుచేశారు. ఆయన త్యాగం తమకు ప్రేరణగా నిలిచిందని, ఆ స్పూర్తితోనే ఇప్పటికే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. త్వరలో మరో 40 వేల పోస్టులను భర్తీ చేసి, రెండున్నర సంవత్సరాల్లో మొత్తం లక్ష ఉద్యోగాలను ఇవ్వడం లక్ష్యమని వెల్లడించారు.
Latest News: GVMC: విశాఖలో పెద్ద మార్పు: జీవీఎంసీ సరిహద్దులు విస్తరణ
ఆడపిల్లల పేరుపై నమోదు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన SRSP ప్రాజెక్ట్ అభివృద్ధిని, బీఆర్‌ఎస్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితిని ప్రజలు పరిశీలించాలని కోరారు. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణేనని, రైతుల కోసం ఇప్పటిదాకా రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశామని చెప్పారు. వందలాది బస్సులను ఆడపిల్లల పేరుపై నమోదు చేసి వారిని యజమానులుగా నిలబెట్టామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోందని తెలిపారు.
పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించినట్లు వివరించారు. సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయని, అయితే హుస్నాబాద్‌లో గత ప్రభుత్వ కాలంలో ప్రారంభించిన గౌరెల్లి ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. ఆ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: