हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News:Telangana: బీజేపీలో మళ్లీ వర్గ విభేదాలు: నాయకత్వంపై నేతల ఆగ్రహం

Pooja
Telugu News:Telangana: బీజేపీలో మళ్లీ వర్గ విభేదాలు: నాయకత్వంపై నేతల ఆగ్రహం

తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP)లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఈరోజు జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పలువురు సీనియర్ నేతలు పార్టీ నాయకత్వం తీరుపై, ముఖ్యంగా సమన్వయ లోపంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు

Read Also: Snap Chat:స్నాప్‌చాట్‌కు ఇకపై డబ్బులు చెల్లించాలా?

ముఖ్యంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల పనితీరు సరిగా లేదని, సరైన కో ఆర్డినేషన్ లేకపోవడం స్థానిక ఎన్నికల వేళ ఏ మాత్రం సరికాదని మండిపడ్డారు.
  • ఎమ్మెల్యే కాటిపల్లి మాట్లాడుతూ, “ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని సమస్య ఎందుకు వస్తుంది?” అని ప్రశ్నించారు. కేవలం పార్టీ ఆఫీసుల్లో కూర్చొని కార్యక్రమాలను డిసైడ్ చేయడం సరికాదని, క్షేత్రస్థాయిలో అటువంటి కార్యక్రమాలు అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రౌండ్ లెవెల్‌లో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, సమావేశాలకు వచ్చి వెళ్లడమే తమ పనా అని నాయకత్వాన్ని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మరో ఎమ్మెల్యే(MLA) మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులతో జిల్లా నేతలకు సరైన సమన్వయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన నేతలకే ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని ఎంపీ డీకే అరుణ సూచించారు.

Telangana

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్పందన:

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ సమస్యలపై స్పందిస్తూ, అన్ని సమస్యలను సరిచేసుకొని సమష్టిగా ముందుకు వెళ్దామని నేతలకు సూచించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అంశంపై విచారణకు ఒక కమిటీని వేస్తామని ప్రకటించారు.

స్థానిక ఎన్నికల సన్నాహాలు:

మరోవైపు, స్థానిక ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ నెల 8న పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, కీలక నేతలు హాజరు కానున్నారు. రాబోయే ఎన్నికల్లో 15 జడ్పీటీసీలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లా అధ్యక్షుడు, ఇన్‌ఛార్జి, అబ్జర్వర్‌తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయనుంది. అనంతరం జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తోంది.

నెల రోజుల క్రితమే బాధ్యతలు చేపట్టిన నూతన అధ్యక్షుడు రాంచందర్ రావు ముందు స్థానిక ఎన్నికలు మరియు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనే రెండు ప్రధాన సవాళ్లు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రతికూల ఫలితాలు వచ్చినా, ఆయన నాయకత్వంపై విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో, ఇవి ఆయనకు అగ్ని పరీక్షగా మారనున్నాయి.

తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశంలో ప్రధానంగా వ్యక్తమైన అసంతృప్తి ఏమిటి?

పార్టీలో తీవ్రమైన సమన్వయ లోపం (Coordination Gap) మరియు నాయకత్వం క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది.

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కీలక నేతలు ఎవరు?

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరియు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి నాయకత్వం తీరుపై తీవ్రంగా ఫైర్ అయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870