బూరుగుపల్లిలో ఘటన
Choppadandi Elections : చొప్పదండి పురపాలక సంఘం ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఇస్తానని తమను ఇంటికి పిలిపించి తీరా సమయానికి టికెట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ చొప్పదండిపట్టణానికి చెందిన కల్లేపల్లి మహేష్ దంపతులు ఆందోళన నిర్వహించారు. గంగాధరమండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటికి దంపతులు చేరుకొని పురుగుల మందు డబ్బా పట్టుకొని తమను ఇంటికి పిలిచి టికెట్ ఇస్తానని వేరే వారికి బీఫామ్ ఇవ్వడం దళితులను అవమానపరచడమేనని వారు పేర్కొన్నారు.
Read Also: Typhoid : తెలంగాణలో పెరుగుతున్న టైఫాయిడ్ మరణాలు..జాగ్రత్త !!
ఆత్మహత్య చేసుకుంటామని నిరసన
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని నిరసన వ్యక్తం చేశారు తీరా సమయానికి టికెట్ ఇవ్వమంటే కేటీఆర్ నుండి ఫోన్ వచ్చిందని ఒత్తిడి వచ్చిందని వేరే వారికి టికెట్ కేటాయించడం సరికాదని అన్నారు తాము పార్టీ నుండి నామినేషన్ హడా వేసామని పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు కన్నీటి ర్యంతమయ్యారు తమకు న్యాయం చేయాలని కోరారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: