మహాధర్నాలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
మక్తల్ టౌన్ (మహబూబ్ నగర్) : మక్తల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రైతు పక్షాన మహాధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. జాతీయ రహదారిపై గంటసేపు కొనసాగిన మహాధర్నా – రైతుల అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ముందు చూపుతో మన ప్రాంతంలో రుద్ర – సముద్రం, గ్రామం గోదాంలు అందుబాటులో ఉన్నా వాటిని వినియోగించకుండా ఎరువుల కొరత కృత్రిమంగా – సృష్టించి ముందుచూపు లేని నాయకత్వం కాంగ్రెస్ పాలనకే దక్కుతుందని విమర్శించారు. గంటసేపు సాగిన మహాధర్నాలో రైతులు ఎక్కడ కూడా – సంతోషంగా లేరన్నారు.
రైతులు పరిసరప్రాంతాల్లో
కాలువల్లో నీళ్లు వదిలి చెరువు – నింపక ఉన్న కాలమంతా జూరాల నుండి కిందికి వదిలి ఆంధ్ర ప్రాంతానికి తరలించే కుట్రలో ఇదొక భాగమని మండిపడ్డారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్వహించే విధానంలో ఒక రిజర్వాయర్ నుంచి నాలుగు టిఎంసిల నీరు ఎలా తోడేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ని ప్రశ్నించారు. రైతులకు కాలువల ద్వారా నీరు తీసుకెళ్తే భూమి కోల్పోయిన రైతులు పరిసరప్రాంతాల్లో ఉన్న రైతులకు మేలు జరుగుతుందని ఇనుప పైపులను భూమిలో వేసి కొడంగల్కు నీరు దోచుకుని పోతామంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఖండించారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులను నిలువుగా మోసం చేసిందని ఆయన తెలిపారు గత పది రోజుల నుంచి యూరియాలేక రైతులు నానా ఇబ్బందులు పడుతూ క్యూ లైన్ లో పాసుబుక్కులు ఆధార్ కార్డులు తమ నిరాశనలను తెలియజేసిన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కనిపించడం లేదన్నారు.
ముందుచూపుతో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కొమ్ముకై రైతులను కష్టాలపాలు చేయడం జరుగుతుందని ఇది తెలంగాణలో సాధ్యం కాదనే విషయాన్ని ఆయన గుర్తించుకోవాలని తెలిపారు. రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ ప్రభుత్వము రైతులకు కావలసిన ప్రతి విషయంలో ముందుచూపుతో పనిచేసిందని గడచిన పది సంవత్సరాలలో రైతులు ఎక్కడ రోడ్డుపై కూర్చోలేదన్నారు. అధికారులు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు గుమ్మకై రైతులకు రావాల్సిన యూరియా (Urea) ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారని రైతులకు ఏ కష్టమొచ్చినా నియోజకవర్గంలో తను రైతు పక్షాన ముందు ఉంటాను అనే విషయం అధికార పార్టీ నాయకులు గుర్తించుకోవాలని ఆయన అన్నారు.
ఈ నియోజకవర్గంలో
ప్రభుత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధుల మెడలు వంచిరైతుల సమస్యల కోసం నిత్యం పోరాడుతానని చెప్పారు రైతుల పక్షాన మాట్లాడుతుంటే స్థానిక మంత్రి అజ్ఞానము చదువు ఏ మాత్రంలేని అవివేకుల తోటే ఏదో ఎదురు దాడి అంతమాత్రాన భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మంత్రి పదవి పొందిన మీరు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేస్తే దానికి ఎప్పటికీ మేము మద్దతు ఇస్తామని తెలిపారు చిల్లర మల్లార్ల అక్షరం జ్ఞానం లేని వాడితో మాట్లాడిస్తే నీ స్థాయి తగ్గుతుందని తెలిపారు నియోజకవర్గం ఏదైనా అభివృద్ధి సాధించిందంటే అది చిట్టెం కుటుంబం ద్వారా సాధ్యమైంది అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు.
పార్టీ అధ్యక్షుడు
దిగత విమర్శలకు పాల్పడితే అదే స్థాయిలో తిరిగి సమాధానం చెప్పడం ఖాయమని , మహేశ్వర్ రెడ్డి, శివరాజ్ పటేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు రాజుల ఆశిరెడ్డి, మక్తల్ పట్టణ పార్టీ అధ్యక్షుడు చిన్న అనుమంతు, సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కె. ఎల్లారెడ్డి (K. Ella Reddy) జడ్పిటిసి అరవిందు సుధాకర్, జుట్ల శంకర్, అన్వరాుస్సేన్, చదపురం అశోక్ గౌడ్, జుట్ల శంకర్, బండారి ఆనంద్, జుట్లసాగర్, మారుతి గౌడ్,సంత్ గౌడ్, రామకృష్ణారెడ్డి, రెడ్డి, సత్యరెడ్డి, శంకర్ రెడ్డి, మహమూద్, మనన్ పాల్గొన్నారు.
చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఎవరు?
చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
సమాజ సేవలో ఆయన ముఖ్యంగా ఏ కార్యక్రమాలు చేశారు?
ఉట్కూరు మండలంలో రైతుబంధూ వేదిక ప్రారంభించడం.మక్తల్ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాల ప్రచారం, సమస్యలపై ప్రజలతో సంభాషించడం.జనవాసులకు కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా పాల్గొన్న సంఘటన చమత్కారంగా గుర్తింపు పొందింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Weather Alert: అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు