Chilli Price: ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో మిర్చి ధరలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న టమాటా మిర్చి ధర శుక్రవారం నాటికి ఊహించని స్థాయికి చేరుకుంది.
Read also: Medak Collector: ప్రతిమ సింగ్ మార్క్ పాలన సాగేనా…?
ధరల ప్రస్థానం ఇలా:
ఈ నెల 18వ తేదీన క్వింటాకు రూ. 35,000 ఉన్న ధర, క్రమంగా పెరుగుతూ 23న రూ. 37,000కి, 25 మరియు 26 తేదీల్లో రూ. 40,000కి చేరింది. అయితే, తాజాగా శుక్రవారం (ఫిబ్రవరి 27న) ఒక్క రోజే క్వింటాకు ఏకంగా రూ. 10,000 పెరిగి, రూ. 50,000 మార్కును తాకింది.
రైతుల్లో హర్షాతిరేకాలు:
కేవలం పది రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ. 15,000 పైగా పెరగడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ధర లభించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోయినా, మార్కెట్‌లో ఉన్న డిమాండ్ కారణంగా గిట్టుబాటు ధర దక్కుతోందని రైతులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: