Chicken Seized in Secunderabad: హైదరాబాద్‌లో 800 కిలోల కుళ్ళిన చికెన్ పట్టివేత

Read Time:  1 min
Chicken Seized in Secunderabad: హైదరాబాద్‌లో 800 కిలోల కుళ్ళిన చికెన్ పట్టివేత
FONT SIZE
GET APP

Chicken Seized in Secunderabad: సికింద్రాబాద్‌లోని పార్సి గుట్ట ప్రాంతంలో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమ మాంసం వ్యాపారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారంతో సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరియు జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా ‘ఏవన్ ఫ్రెష్ చికెన్’ షాపుపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

Read Also: Siddipet Road Obstruction: మూడు రోజులుగా రోడ్డు పైనే జనరేటర్

800 కిలోల నిల్వ ఉంచిన మాంసం స్వాధీనం

చాలా రోజుల క్రితమే నిల్వ చేసిన, దుర్వాసన వస్తున్న సుమారు 800 కిలోల కుళ్ళిన చికెన్‌ను అధికారులు ఈ కేంద్రంలో గుర్తించారు. ఈ మాంసాన్ని ఫ్రీజర్లలో ఉంచి నగరంలోని వివిధ బార్లు మరియు రెస్టారెంట్లకు క్రమం తప్పకుండా సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు. పాత మాంసాన్ని తాజాగా ఉన్నట్లుగా నమ్మించి వినియోగదారుల ప్రాణాలతో యజమాని చెలగాటమాడుతున్నాడని అధికారులు వెల్లడించారు.

Chicken Seized in Secunderabad: హైదరాబాద్‌లో 800 కిలోల కుళ్ళిన చికెన్ పట్టివేత
Chicken Seized in Secunderabad: 800 kg of rotten chicken seized in Hyderabad

లైసెన్స్ లేకుండా అక్రమ విక్రయాలు

కేవలం కల్తీ మాంసమే కాకుండా, సదరు షాపు నిబంధనలను కూడా తుంగలో తొక్కినట్లు సోదాల్లో తేలింది. ఈ షాపునకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ గడువు ఈ ఏడాది జనవరిలోనే ముగిసిపోయింది. ఎటువంటి అనుమతులు లేకుండానే గత రెండు నెలలుగా అక్రమంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి షాపు యజమాని షకిల్ తో పాటు మరికొంతమంది సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన 800 కిలోల చికెన్‌ను నాశనం చేసిన అధికారులు, ప్రజారోగ్యానికి హాని కలిగించే ఇలాంటి వ్యాపారాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.