హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులో గల కర్రెగుట్టలో మావోయిస్టులు మరోసారి భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ పేలుళ్లకు పాల్పడ్డారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ అడవులతో పాటు కర్రెగుట్టల్లో కొత్త తరహా ల్యాండ్ మైన్ (ఆర్బిఐఈడీ)లను అమర్చిన మావోయిస్టులు పది మంది పోలీసులను బలిగొనడం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు గాయపడడం విదితమే. దీని తరువాత భద్రతాబలగాలు తగిన జాగ్రత్తలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా కర్రెగుట్టల్లో ఆదివారం సాయంత్రం ఆరు ఐఈడీ బాంబులు పేల్చిన నక్సలైట్లు పోలీసులకు మరోమారు సవాల్ విసిరారు. ఈ ఘటనలో 10 మంది ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రిజర్వ్ బలగం సిబ్బందితో పాటు కోబ్రా టాలి యన్కు చెందిన ఒక ఎస్ఐఐ గాయపడ్డారు. వీరి పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Read also: West Bengal: గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి
Chhattisgarh: Explosions again in the Karregutta hills
కర్రెగుట్టలో వరుస ఐఈడీ పేలుళ్లు
ఈ ఘటన దరిమిలా కర్రెగుట్టలో ఐఈడీ బాంబులతో పాటు ఇతర పేలుడు పదార్థాలను గుర్తించేందుకు పోలీసు జాగిలాలచే పోలీసులు తనిఖీలు చేబట్టారు. వచ్చే మార్చి నెలాఖరుకు దేశంలో నక్సలైట్ల ఏరివేత పూర్తిగా జరగాలని, మావోయిస్టు రహిత భారత్ను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా నక్సల్స్ ప్రభావం ఎక్కువగా వున్న ఛత్తీస్మర్తో పాటు వారి స్థావరాలు వున్న మహారాష్ట్ర, మూర్కండ్లలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్ కగార్ చేబట్టడం విదితమే. ఇందులో భాగంగా వేల సంఖ్యలో పారా మిలటరీ బలగాలను నర్సల్స్ స్థావరాలున్న చోట మొహరించడం, కూంబింగ్ నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా జరుగుతున్న ఎదురు కాల్బుల్లో నక్సల్స్ తరపున ప్రాణ నష్టం వాటిల్లుతోంది.
కూంబింగ్ ఆపరేషన్‌తో కట్టుదిట్టమైన భద్రత
గత ఏడాది మార్చి నెలలో నక్సల్స్ ఆర్సిఐఈడీ బాంబులతో పోలీసులను హడలెత్తించడం తెలిసిందే. సాధారణ మందు పాతరలకు భిన్నంగా అర కిలోమీటర్ లేదా కిలోమీటర్ దూరం నుంచి కూడా రిమోట్రతో పేల్చగల ఆర్సిఐఈడీలను నక్సల్స్ వాడడం పోలీసులను కలవర పరిచింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ తరహా బాంబుల కారణంగా పది మంది భద్రతా సిబ్బంది మరణించారు. అప్పట్లో ఈ బాంబులు పోలీసులను రెండు నెలల పాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. దీని తరువాత ఆర్సిఐఈడీలపై భద్రతా బలగాలు ఆరా తీయగా ఇదే సమయంలో వీటి గురించి నిఘా వర్గాలు మరింత సమాచారం సేకరించి పోలీసులను హెచ్చరించాయ.
2024లో ఛత్తీస్ ఘడ్లో 50 ముందు పాతరలు పేలిన ఘటనలు జరిగాయి. ఇందులో కొన్ని పోలీసులను బలి తీసుకోగా మరికొన్నింటిని పోలీసులు గుర్తించి పేల్చి వేశారు. మరో 28 మందు పాతరలను పోలీసులు గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు. 2025లో జనవరి నుంచి మార్చి నెల వరకు మందు పాతరలు పేలడం లేదా వాటిని నిర్వీర్యం చేయడం, పోలీసులు పేల్చడం వంటి ఘటనలు వంద వరకు వుండడం గమనార్హం. ఈ ఘటనల తరువాత భద్రతా బలగాలు తేరుకుని ఛత్తీస్‌గఢ్ తో పాటు నక్సల్స్ కోటగా ఒకప్పుడు వున్న కర్రెగుట్టలో వరుసగా కూంబింగ్ చేబట్టి వారి స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా భారీగా ఆయుధాలను జపు వేశారు. ఈ క్రమంలోనే కర్రెగుట్టలో బేస్ క్యాంపులు, ఫార్వర్డ్ విభాగాలను నెలకొల్చి భారీగా పోలీసులను మొహరించారు.
పేలుడు పదార్థాల కోసం గాలింపు చేబట్టారు
ఈ నిత్యం కర్రెగుట్టలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఆదివారం సాయంత్రం వేళ ఒక్కసారిగా వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 11 మంది భద్రతా బలగాలు గాయపడగా వారిని రాయపూర్ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. కర్రెగుట్టలో నక్సల్స్న ఏరివేసిన ధీమాతో వున్న పోలీసులకు ఇప్పుడు వారు అమర్చిన బాంబులు భద్రతా. బలగాలను కలవర పరుస్తున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో కర్రెగుట్టలో సిఆర్పిఎప్కు చెందిన పోలీసు జాగిలాలచేత మందు పాతరలు, పేలుడు పదార్థాల కోసం గాలింపు చేబట్టారు. పేలుళ్లలో పంథా మార్చిన నక్సల్స్ ఇదిలా ఉండగా భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ పేలుళ్లకు పాల్పడే నక్సల్స్ ఇప్పుడు వంథా మార్చారు. గతంలో మందు పాతరలను పోలీసుల క్యాంపులకు మూడు నుంది ఏడు కిలోమీటర్ల దూరం వరకు పేల్చేవారు.
నక్సల్స్ విషయంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా వుండాలని
ప్రస్తుతం ఇది మూడు కిలోమీటర్ల వరకు చేరిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసు బేస్ క్యాంపులు ఎక్కువవుతుండడంతో నక్సలైట్లు. ఎదురు దాడికోసం ఆర్సిఐఈడీలతో పాటు ఐఈడీలను భారీగా వాడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. గత ఏడాది ఛత్తీస్ఘడ్ లోని బీజాపూర్ సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపు వద్ద ఐదు కిలోల ఆర్సిఐఈడీని నక్సల్స్ అమర్చగా దీనిని పోలీసు జాగిలాలు గుర్తించడంతో పెద్ద ముప్పు తప్పింది. ఇటువంటి ఆర్బిఐఈడీని గత ఏడాది జనవరి నెలలో మరో బేస్ క్యాంపు సమీపంలో పోలీసులు గుర్తించారు. ఒకచోట మందు పాతర లభించగా దానికి సంబంధించిన యాంటెన్నా అర కిలోమీటర్ లేదా కిలోమీటర్ దూరంలో చెట్ల వద్ద వుండడం పోలీసులను పాల్కు గురిచేసింది. ఇటువంటివి మరిన్నింటిని ఛత్తీస్ ఘడ్తో పాటు జార్కండ్ రాష్ట్రంలో భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. తాజాగా ఐఈడీ బాబుల నేపథ్యంలో నక్సల్స్ విషయంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా వుండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: