చెక్ డ్యాంల కూల్చివేతపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
హైదరబాద్ : పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యాంలు కూలిపోవడం (Check dam collapse)పై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వరుసగా సంభవిస్తున్న కూల్చివేతలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని తెలిపారు. సోమవారం గుంపుల, ఆడవిసోమనిపల్లి గ్రామాల్లో కూలిపోయిన చెక్ డ్యాంలను ఆయన పరిశీలిం చారు. మానేరునదికి అడ్డంగా నిర్మించిన చెక్ డామ్లు నాసిరకంగా, నాణ్యతలేమితో ఉన్నాయా ఎవరైనా కావాలనే ధ్వంసం చేశారా అనే అంశం పరిశీలించడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించడం జరిగిందని వివరించారు.
Read Also: Christmas Holidays: తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు
కావాలనే ధ్వంసమా? మానేరు చెక్ డ్యాంలపై విజిలెన్స్ ఎంక్వైరీ
ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలు, విద్రో హక చర్యలపై మా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని తెలిపారు. విచారణను వేగవంతం చేసి బాధ్యులను గుర్తించాలని ఇప్పటికే విజిలెన్స్ డిపార్ట్ మెంట్ను ఆదేశించడం జరిగిందని చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా కావాలని రైతన్నలకు మేలు చేసే చెక్ డ్యాంలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే ఊపేక్షించబోమని చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సచివాలయంలో విలేకరులతో చిట్చాట్ చేస్తూ హరీష్ రావు తన పేరు గోబెల్స్ రావు అని మార్చు కోవాలని సూచించారు.
కాళేశ్వరం కూలిపోయిన బాధ్యత మీదే
కాళేశ్వరంలో మూడు బ్యారేజ్లు కూలిపోతే సిగ్గుతో తలదించుకోవా ల్సింది పోయి ఎదురు దాడి చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం విషయంలో బిఆర్ఎస్ నాయకులు సిగ్గుతో తలవంచుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కాళేశ్వరం కట్టారని ఐనా బరితెగింపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు సాగునీటిని అందించే ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్, కెసిఆర్ కట్టిన కాళేశ్వరం ఒకటి కూలిపోయిందని చెప్పారు. కాళే శ్వరం నుంచి ఐదేళ్లలో 80 నుంచి 90 టిఎంసిలు ఎత్తిపోసి వివిధ ప్రాజెక్టులకు అందిచారని గుర్తుచేశారు. హరీష్ రావు అతి తెలివి తేటలు వాడటం ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.
కృష్ణా జలాల విషయంలో 2014 నుంచి 2020 వరకు ఆపేక్స్ కౌన్సిల్ భేటీలో కెసిఆర్ ఆంధ్రకు 512 టిఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసిలకు ఒప్పుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలోని పాలమూరు, కల్వ కుర్తి, నెట్టెంపాడు, డిండి, ప్రాజెక్టులను కెసిఆర్(K. Chandrashekar Rao) ఎందుకు పూర్తి చెయ్యలేదని నిలదీశారు. కెసిఆర్, హరీష్ రావు బరితేగించి మాట్లాడుడు మానుకోవాలని హితవు చెప్పారు. కెసిఆర్ అప్పులు తీర్చడానికి ఏడాదికి 16 నుంచి 20 వేల కోట్లు రూపాయలు కడుతున్నామనిఆవేదనతో అన్నారు. గతంలో వాళ్లు చేసిన 45 టిఎంసిలు మైనర్ ఇరిగేషన్, గోదావరి డివెర్షన్ సేవింగ్ 45 టిఎంసిలు నిర్ణయం ప్రకారమే రాసిన లేక కొత్తది కాదని చెప్పారు. గత బిఆర్ఎస్ ఒప్పందాన్నే మేము లేఖను రాసాను అని ఆయన తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: