📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Hyderabad Heavy Rain: చార్మినార్ పెచ్చులు ఊడిపడి, భయంతో పరుగులు తీసిన పర్యాటకులు

Author Icon By vishnuSeo
Updated: April 3, 2025 • 10:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అకస్మాత్తుగా కురిసిన వర్షం – ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

హైదరాబాద్‌లో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ నీటమునిగిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా చార్మినార్ వద్ద వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. వర్షం కారణంగా చార్మినార్ పెచ్చులు ఊడిపడి రోడ్లపై పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనతో అక్కడే ఉన్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు.

ఖైరతాబాద్‌లో చెట్టు కూలిన ఘటన – ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటకు

ఖైరతాబాద్‌లో మెర్క్యూరీ హోటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ, ఆ కారులో ఉన్న ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు.

ఉరుములు, మెరుపులతో దంచికొట్టిన వర్షం – రహదారులు నీటమునిగిన నగరం

నగరవ్యాప్తంగా వర్షం ఉరుములు, మెరుపులతో దంచికొట్టింది. రహదారులు పూర్తిగా నీటమునిగి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాతబస్తీలో గంటపాటు భారీ వర్షం కురిసింది, దీంతో అక్కడ ఎక్కువ వర్షపాతం నమోదైంది.

చార్మినార్‌కు నష్టం – పెచ్చుల ఊడిపాటు

వర్షం ప్రభావం చార్మినార్‌కు నష్టం కలిగించింది. తాజాగా మరమ్మతులు చేసిన మీనార్ నుంచే చార్మినార్ పెచ్చులు ఊడిపడి చాలా ఇబ్బందులను ఆ పరిసర ప్రాంతాలకు కలిగించారు. అయితే పెచ్చులు పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఊడిపోయిన పెచ్చులను శుభ్రం చేసి, మరమ్మతుల పనులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.

Hyderabad Heavy Rain – ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్లతో వర్షం పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే రైతులు, ప్రజలు వర్షం పడే సమయంలో భయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు కురిసిన వర్షాలకు ఏపీలో ఇద్దరు, తెలంగాణలో ముగ్గురు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. అందుకే వర్షం వచ్చే సమయంలో భయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.

Breaking News in Telugu Charminar Google News in Telugu hyderabad Hyderabad Heavy Rains Khairtabad Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.