📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Annapurna Canteen : అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును మార్చడం సిగ్గుచేటు – కేటీఆర్

Author Icon By Sudheer
Updated: June 29, 2025 • 9:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నపూర్ణ భోజన పథకం’ (Annapurna Canteen) పేరును మార్చి ‘ఇందిరా క్యాంటీన్'(Indira Canteen)గా మారుస్తూ తీసుకున్న నిర్ణయం చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ పేరు మార్పు అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పిస్తూ, “మీరు గాంధీ కుటుంబాన్ని ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారా?” అని ప్రశ్నించారు. అంత అవసరమైతే మీ పేరు ‘రాజీవ్’ లేక ‘జవహర్’గా మార్చుకోండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పెరుగుతున్న రాజకీయ వేడి – బీఆర్ఎస్, బీజేపీ వ్యతిరేకత

ఈ నిర్ణయం పట్ల బీఆర్ఎస్ కాకుండా బీజేపీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట నిరసనలు నిర్వహించి, ‘అన్నపూర్ణ’ పేరులోని సాంస్కృతిక ప్రాముఖ్యతను నిలుపుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మద్దతు పొందేందుకు, ఢిల్లీ పెద్దల శుభాభిప్రాయాన్ని పొందేందుకు ఈ మార్పు చేసిందని విమర్శలు గుప్పించారు. బీజేపీ నేత ఎన్వీ సుభాష్ ఈ చర్యను ‘పబ్లిసిటీ స్టంట్’గా అభివర్ణిస్తూ, ఇది ఎమర్జెన్సీకి 50 ఏళ్ల రిటర్న్ గిఫ్టా? అని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ వివరణ – సేవల విస్తరణ కోసం పేరుమార్పు

మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పింది. ‘ఇందిరా క్యాంటీన్’ పేరుతో పథకాన్ని మరింత విస్తరించి, పేదలకు అందుబాటులో ఉండేలా చేయడమే తమ లక్ష్యమని తెలిపింది. పేరుమార్పు కేవలం రాజకీయ అంశం కాదని, భోజన సేవల్లో నాణ్యత, పరిమాణాన్ని మెరుగుపరచాలనే దిశగా తీసుకున్న నిర్ణమని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే ప్రజలు, విపక్షాల వాదన ప్రకారం పేరు మార్చడం అవసరమా అనే ప్రశ్న ఇంకా సమాజంలో ప్రతిధ్వనిస్తుంది.

Read Also ; Anil Ravipudi: దిల్ రాజు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అనిల్ రావిపూడి

Annapurna Canteen Google News in Telugu Indira Canteen ktr revanth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.