📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

తెలంగాణలో 8 కులాల పేర్ల మార్పు.. నోటిఫికేషన్‌ జారీ

Author Icon By sumalatha chinthakayala
Updated: January 6, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: కులం పేర్లను ఇప్పటికీ , తిట్లగా ఉపయోగిస్తున్నారు. సినిమాలు, రాజకీయాల వేదికలపై కొన్ని కులాల పేర్లు మనస్సుని బాధించేలా, అవమాన కరంగా వాడబడుతున్నాయి. ఈ విషయం చూసి, ఆయా కులాలకు చెందిన వ్యక్తులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వారి కులాన్ని అవమానించడం, ఆత్మాభిమానం దెబ్బతీయడం లాంటివి జరుగుతున్నాయని వారు ఆవేదనతో స్పందిస్తున్నారు. తమ కులాలను చులకనంగా, తిట్లుగా ఉపయోగించడం కంటే, ఈ కులాల పేర్లను మార్చాలని పలు కుల సంఘాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో, బీసీ కమిషన్‌కు కూడా కొన్ని సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

బీసీ జాబితాలో ఉన్న ఎనిమిది కులాల పేర్లను మార్చాలని, కొన్ని పర్యాయపదాలు జోడించాలని సూచనలు వచ్చాయి. తెలంగాణ బీసీ కమిషన్ ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలను కోరింది. దీనిని సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసారు. సమాజంలో కొన్ని పేర్లు అవమానకరంగా వినిపిస్తున్నాయి, వాటిని మార్చాలని బహిరంగ విచారణలో తేలింది. బీసీ కమిషన్ కార్యాలయంలోనూ పలువురు కుల సంఘాల ప్రతినిధులు విన్నవించారు. ఈ విషయంపై కమిషన్ ప్రాథమిక చర్చలు నిర్వహించింది.


Change of names of 8 castes in Telangana.. Notification issued

ఈ పేర్ల మార్పులపై ఎవరైనా అభ్యంతరాలు, సూచనలు ఉన్నా, వాటిని తెలుపమని నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. ఈ నెల 18వ తేదీ వరకు, హైదరాబాద్‌లోని జలమండలి ఆవరణలోని బీసీ కమిషన్ కార్యాలయంలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ అభ్యంతరాలు, సూచనల ఆధారంగా కులాల పేర్ల మార్పుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని బీసీ కమిషన్ కార్యదర్శి బాలమాయాదేవి వెల్లడించారు.

కులాల పేర్ల మార్పుల ప్రతిపాదనల ప్రకారం:

.దొమ్మర (బీసీ ఏ) – గాంద వంశీయ

.తమ్మలి (బ్రాహ్మణేతరులు, శూద్రులు) – బ్రాహ్మణేతర, శూద్ర పదాల తొలగింపు

.రజక (చాకలి, వన్నర్) – వన్నర్ తొలగించి దోబి పర్యాయపదం చేర్పు

.బుడబుక్కల – ఆరె క్షత్రియ జోషి / శివ క్షత్రియ / రామజోషి

.కుమ్మర లేదా కులాల, శాలివాహన – ప్రజాపతి పర్యాయ పదం చేర్పు

.చిప్పోళ్లు (మేర) – మేర

.వీరముష్ఠి (నెట్టికొటాల), వీరభద్రీయ – వీరభద్రీయ

.ఈ మార్పులతో, కులాల పేర్లకు మరింత గౌరవాన్ని ఇవ్వాలని భావిస్తున్నారు.

8 castes bc commission names Change Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.