తెలంగాణలో ఇంటర్ పరీక్షల (TG Inter) నిర్వహణ కోసం ముందు విడుదల చేసిన తేదీల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 3న జరగాల్సిన పరీక్షను మార్చి 4న నిర్వహించనున్నట్లు పేర్కొంది. హోలీ పండుగ సందర్భంగా ఈ మార్పులు చేసినట్లు వివరించింది.
Read Also: Minister Sitakka: ఉపాధి హామీ పథకాన్ని చంపేందుకు కుట్ర
పరీక్ష తేదీ మార్పు పై త్వరలోనే అధికారిక ప్రకటన
హోలీ పండుగ మార్చి 4న జరుగుతుందనే ఉద్దేశంతో ఇంటర్ బోర్డు (TG Inter) పరీక్షల షెడ్యూల్ ను రూపొందించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం హోలీ సెలవు మార్చి 3గా ప్రకటించింది. దీంతో ఆ రోజు జరగాల్సిన ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షను మరుసటి రోజు.. మార్చి 4కు వాయిదా వేశారు.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటున్నారు. ఆ ఒక్క రోజు జరగాల్సిన పరీక్షలను మాత్రమే పోస్ట్ పోన్ చేస్తున్నారు. మిగిలిన పరీక్షలన్నీ ఇదివరకు ప్రకటించిన తేదీల్లోనే జరుగుతాయని అధికారులు చెప్తున్నారు. పరీక్ష తేదీ మార్పు గురించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: