📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Municipalities: 11 మున్సిపాలిటీల్లో ఛైర్మన్​ ఎన్నిక వాయిదా

Author Icon By Vanipushpa
Updated: February 16, 2026 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో మున్సిపాలిటీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. వివిధ కారణాలతో 11 మున్సిపాలిటీ(Municipalities)ల్లో ఛైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. ఇల్లందు, సుల్తానాబాద్‌, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్‌, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్‌, ఇంద్రేశం, డోర్నకల్‌, జనగామ, తొర్రూరులో ఎన్నికలు వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. జనగామలో ఉదయం నుంచే హై డ్రామా కొనసాగింది. ఛైర్మన్, వైస్​ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తన మద్దతున్న 15 మంది కౌన్సిలర్లతో బస్సులో వస్తున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. బస్సును ఆపిన డీసీపీ రాజా మహేంద్ర 28వ వార్డులో గెలిచిన అభ్యర్థిని కిడ్నాప్ చేశారని బంధువులు ఇచ్చిన పిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని ఆమెను విడిచి వెళ్లాలని సూచించారు. దీనికి ఎమ్మెల్యే అందుకు ససేమిరా అనడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.

Read Also: Kavitha: తెలంగాణ జాగృతిలో చేరిన కావేటి సమ్మయ్య కుటుంబం

Municipalities: 11 మున్సిపాలిటీల్లో ఛైర్మన్​ ఎన్నిక వాయిదా

కమిషనర్ ఎన్నికను రేపటికి వాయిదా

తీవ్ర వాగ్వాదం అనంతరం పోలీసులు బీఆర్​ఎస్ కౌన్సిలర్లను లోనికి అనుమతి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉన్న 15 మంది కౌన్సిలర్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు లోనికి వెళ్లారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఛైర్మన్ ఎన్నికకు ఇరు వర్గాలు అభ్యర్థులను ప్రతిపాదించారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను ఎమ్మెల్యే పల్లా ప్రలోభాలకు, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, కేసు కూడా నమోదైందని దానిపై విచారణ జరిగిన తర్వాతే ఎన్నిక నిర్వహించాలని అప్పటి వరకు వాయిదా వేయాలని ఎంపీ చామల ఎన్నికల మున్సిపల్ కమిషనర్​ను కోరారు. దీనికి మద్దతుగా కాంగ్రెస్ కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించి ఎన్నిక వాయిదా వేయాలని పట్టు పట్టారు. ఎన్నిసార్లు చెప్పినా వినక పోవడంతో కమిషనర్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh politics AP Local Governance Chairman Election Postponed Election Delay Latest News in Telugu local body elections municipal corporation Municipal Elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.