గుంతకల్లు రైల్వే : ప్రస్తుత పండుగల సమయంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో రైల్వేశాఖ పండుగ ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. తిరుపతి(Tirupati) నుంచి సికింద్రాబాద్ వెళ్ళే నెంబర్ 07497 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ ఈనెల 17న తిరుపతి నుంచి బయలుదేరుతుంది. మార్గమధ్యంలో ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, నడికూడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో నిలుస్తుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే నెంబర్ 07498 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు(Central railway) ఈనెల 18న శనివారం సికింద్రాబాద్ నుంచి బయలు దేరుతుంది. మార్గమధ్యంలో ఈ రైలు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, సూలేహళ్ళి, యాద్గార్, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో నిలువనుంది. ధర్మవరం నుంచి షోలాపూర్ వెళ్ళే నెంబర్ 01438 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ ఈనెల 18న శనివారం ధర్మవరం నుంచి బయలుదేరుతుంది.
Read also: జగన్ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్
ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో రైల్వే శాఖ పండుగ స్పెషల్ రైళ్లను ప్రవేశపెట్టింది.
ఈరైలు మార్గమధ్యంలో కదిరి, మొలకలచెరువు, మదనపల్లె, పీలేరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూరు, క్రిష్ణా, యాద్గార్, వాడి స్టేషన్లలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలోని (Central railway) ముఖ్యమైన స్టేషన్లలో నిలుస్తుంది. అలాగే దర్భాంగ నుంచి యశ్వంతపూర్ వెళ్ళే నెంబర్ 05541 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ ఈనెల 20 నుంచి నవంబర్ 17 వరకు ప్రతి సోమవారం దర్భాంగ నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో యశ్వంతపూర్ నుంచి దర్భాంగ వెళ్ళే నెంబర్ 05542 ఎక్స్ ప్రెస్ ఈనెల 23 నుంచి నవంబర్ 20 వరకు ప్రతి గురువారం యశ్వంతపూర్ నుంచి బయలు దేరుతుంది. ఈ రైళ్లు మార్గమధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రామగుండం, కాజీపేట్, కాచిగూడ, మహబూబ్ నగర్, డోన్, ధర్మవరం, హిందూపురం స్టేషన్లతోపాటు బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని ముఖ్యమైన స్టేషన్లలో నిలుస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: