📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Central Minister: ప్రజల మద్దతు బీజేపీకె కిషన్ రెడ్డి

Author Icon By Saritha
Updated: February 11, 2026 • 11:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: మున్సి పల్ ఎన్నికల్లో పరాజయం తప్పదని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పై, తనపై పనిగట్టుకుని విమర్శలకు దిగుతున్నారని (Central Minister) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరికీ దత్తపుత్రుడిని కానని, కేసీఆర్ కు రేవంత్ కు ఏదైనా తగాదాలు ఉంటే వాళ్లు వాళ్లే తేల్చుకోవాలని హితవు చెప్పారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చే అధికారం మీకెవరిచ్చారని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రేవంత్ వచ్చి రెండున్నరేళ్లు అవుతోందని, ఈ రెండున్నరేళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కువగా ఇచ్చిందా? లేక రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఇచ్చిందో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి తప్పితే.. చేసేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు.

Read Also: Mancherial: తెలంగాణలో కొర్రమీను క్లస్టర్

వ్యక్తిగత విమర్శలపై సీఎం రేవంత్‌పై ఆగ్రహం

తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఏమిచ్చిందో వివరించేందుకు బహిరంగ చర్చకు తాను సిద్ధమని, సెక్రటేరియేట్ లేదా ప్రెస్ క్లబ్లో ఎక్కడ చర్చ పెడతారో చెప్పండి వస్తాననని సీఎంకు మరో సవాల్ విసిరారు (Central Minister). హామీలు అమలు చేయాలని విమర్శలు చేస్తున్నారని సీఎం దుయ్యబట్టారు. ఇది సరైన పద్ధతి కాదని, అంత సరదాగా ఉంటే తన పేరును రేవంత్ గా మార్చుకోవాలని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. తనపై సీఎం వ్యక్తిగత విమర్శలకు దిగారని, తన పేరు, ఇంటిపేరు మార్చి పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఎంఐఎంతో కాపురం చేసినన్ని రోజులు నిప్పులు పోస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్తో రహస్య ఒప్పందాలు చేసుకుని లోపాయికారీ రాజకీయాలు నడుపుతున్నాయని ఆయనఆరోపించారు. రాష్ట్రంలో మూడు వేల డివిజన్లలో మజ్లిస్ ఉండి కూడా చేయకపోవడం వెనుక కుమ్మక్కే కారణమున్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలన్నీ గాలిలో కలిసిపోయాయని విమర్శించారు. చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ నిందలు వేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యమని దుయ్యబట్టారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం: కిషన్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం అనివార్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి బీజేపీకి అద్భుతమైన స్పందన వచ్చిందని, దాంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లకు భారీగా డబ్బులు వెదజల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రధాని మోదీ వచ్చి మోరీలు సాఫ్ చేస్తారా అని సీఎం అడుగుతున్నారని మరి మున్సిపల్ మంత్రిగా సీఎం రేవంత్ వెళ్లి మోరీలు సాఫ్ చేస్తారా? అని ప్రశ్నించారు. దేశం స్వర్భంగా ఉండాలనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ పథకం తీసుకొచ్చి గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రతను తీసుకొచ్చిందే కేంద్ర ప్రభుత్వమని గుర్తు చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు కేంద్రంతో సంబంధం ఏముందని ప్రశ్నిస్తున్నారని, పట్టణ ప్రాంతాలకు, గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన భారీగా నిధులు అండజేస్తోందని గుర్తు చేశారు. ఈ విషయం సీఎం రేవంత్రెడ్డి తెలుసుకోవాలన్నారు.

మా తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చే అధికారం మీకెక్కడిది?

సరదా ఉంటే మీ పేరు రేవంత్ ఖాన్ గా మార్చుకోండి మజ్లిస్తో కాపురం చేసినన్ని రోజులు మీపై నిప్పులు పోస్తూనే ఉంటాం కెసీఆర్కు, మీకు ఏదైనా ఉంటే మీరే తేల్చుకోండి: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేస్తామని ఎప్పుడు కూడా కేంద్రం చెప్పనేలేదని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల క్రమాలు, అధికార మర్వినియోగం, ఆరాచకాలను ప్రజలు మర్చిపోలేదని, ఆ పార్టీకి ఒటేసినా మూసీ నదిలో వేసినా ఒక్కటేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. తమ ఇంటికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు రావొద్దంటూ రిటైర్ బెనెఫిట్స్ రాని ఉద్యోగులు బోర్డులు పెట్టుకున్నారని, డీఏలను తొలిసారిగా వాయిదాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం సిగ్గుచేటన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏది ఉన్నా స్టీరింగ్, హారన్, ఎస్కలేటర్ తమ చేతుల్లో ఉందంటూ గతంలో అసదుద్దీన్ ఒవైసీ చెప్పగా, నేడు సీఎం రెడ్డి అయినా, రావు అయినా తమ దగ్గరికి రావాల్సిందేనని అని అక్బరుద్దీన్ ఒవైసీ చసిన దారుణమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎన్ రెండు పార్టీలు మజ్లిస్ పార్టీకి వానిసలుగా బతుకుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమాల గురించి విచారణ జరుపుతామని ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

BJP hyderabad Kishan Reddy Latest News in Telugu Municipal Elections Revanth Reddy Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.