📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: Central: కరెంటు సరఫరా ప్రై’వేటు’!

Author Icon By Saritha
Updated: October 16, 2025 • 1:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వ డిస్కంలకు పోటీ సంస్థలు విద్యుత్ రంగంలో భారీ మార్పులకు శ్రీకారం రాష్ట్రాలకు కేంద్ర ముసాయిదా చట్టం

హైదరాబాద్ : విద్యుత్ రంగంలో పెద్ద మార్పును కేంద్రం తీసుకొస్తోంది.
ఒకే ప్రాంతంలో బహుళ విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కమ్స్) ప్రతిపాదించాలని నిర్ణయించింది. ప్రభుత్వ(Central) డిస్కంలకు పోటీగా ప్రైవేటుకు దారాదత్తం చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడిచే డిస్కంలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు, వాటిని పరిష్కరించడానికి, సమర్థవంతమైన వనరుల వినియోగం, మెరుగైన సేవా నాణ్యతను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు దీనికి సంబంధించి కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ విద్యుత్ చట్టానికి సవరణ ముసాయిదాను విడుదల చేసింది. ఈ ముసాయిదాను తాజాగా రాష్ట్రాల అభిప్రాయానికి పంపించింది. దీని ప్రకారం పస్తుత విద్యుత్ పంపిణీ మౌళిక సదుపాయాలను ఉపయోగించి ఒకే ప్రాంతంలో బహుళ పంపిణీ సంస్థలను (డిస్కమ్లు) పనిచేయడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిస్కమ్లు ఆధిపత్యం చెలాయించే ఈ రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యం మరియు పోటీకి తెరవడం ఈ మార్పుల లక్ష్యంగా ముసాయిదా చట్టం వెల్లడించింది. ఈ ముసాయిదాను జారీ చేసిన తేదీ నుండి 30 రోజుల్లోపు అభిప్రాయాన్ని తెలియచేయాలని సూచించింది.

Read also: ఆస్ట్రేలియాతో సిరీస్‌.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోహ్లీ పోస్ట్

విద్యుత్ రంగంలో ప్రైవేట్ రంగ ప్రవేశానికి కేంద్రం తలుపులు

ప్రస్తుతం దేశంలో దాదాపు 67 డిస్కమ్లు ఉన్నాయి, వాటిలో 16 ఢిల్లీ, ముంబై, ఒడిశా, పశ్చిమ బెంగాల్, గుజరాత్ మరియు దాద్రా నాగర్ హవేలి వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రైవేట్గా నడుస్తున్నాయి. టాటా పవర్, అదానీ గ్రూప్, టోరెంట్ పవర్, సంజీవ్ గోయెంకా గ్రూప్ వంటి ప్రైవేట్ కంపెనీలు కీలక ఆపరేటర్లలో ఉన్నాయి. ఇకన “విద్యుత్ (సవరణ) బిల్లు 2025 ముసాయిదా ప్రకారం, ప్రతిపాదిత మార్పులు ఇప్పటికే ఉన్న పంపిణీ నెట్వర్క్లకు వివక్షత లేని ఓపెన్ యాక్సెస్ను స్పష్టంగా తప్పనిసరి చేస్తాయి. దీనివల్ల బహుళ సరఫరాదారులు ఒకే మౌళిక సదుపాయాలను సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, ప్రతిపాదిత సవరణ ఇప్పటికే ఉన్న పంపిణీ నెట్వర్కు వివక్షత లేని ఓపెన్ యాక్సెస్ను స్పష్టంగా తప్పనిసరి చేస్తుంది. ఇది బహుళ సరఫరాదారులు ఈ మోలిక సదుపాయాలను సమర్థవంతంగా ఉపయోగించుకోగలరని, రిడెండెన్సీని తొలగిస్తుందని మరియు ఇందుకయ్యే ఖర్చులను తగ్గించగలరని నిర్ధారిస్తుంది“ అని ముసాయిదా పేర్కొంది.

ప్రభుత్వ డిస్కంలకు పోటీగా ప్రైవేటు సంస్థలు

ప్రస్తుత చట్టం అదే ప్రాంతంలో రాష్ట్ర(Central) ప్రభుత్వ డిస్కలకు సమాంతరంగా సొంత పంపిణీ నెట్వర్స్ను నిర్మించుకుంటేనే ప్రైవేటు లైసెన్సుదారులను అనుమతిస్తుందని స్పష్టం చేసింది. ఈ కొత్త ప్రతిపాదనతో ప్రైవేట్ కంపెనీలు విద్యుత్ సరఫరా చేయడానికి ఇప్పటికే ఉన్న రాష్ట్ర మోలిక సదుపాయాలను ఉపయోగించుకునే వీలును కల్పిస్తుంది. 2022లో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు విద్యుత్(Electricity)రంగ ఉద్యోగి సంఘాల నుండి వ్యతిరేకత రావడంతో దానిని పక్కన పెట్టారు. అయితే మళ్లీ దీన్ని కేంద్రం తెరముందుకు తీసుకొచ్చింది. వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి, సేవా నాణ్యతను మెరుగుపరచడానికి మరియు తుది వినియోగదారులకు మరింత సరసమైన మరియు నమ్మదగిన విద్యుత్తును అందించడంలో దోహదపడుతుందని ఇంధన మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Adani Electricity Breaking News in Telugu Central Government Energy Policy Electricity Distribution India Energy Ministry India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.