📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Good News : ఆ ఆసుపత్రుల్లోనే నగదు రహిత చికిత్స – మంత్రి పొన్నం

Author Icon By Sudheer
Updated: June 25, 2025 • 7:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) రోడ్డు ప్రమాద బాధితులకు సంబందించి శుభవార్త చెప్పారు. ప్రమాదం జరిగిన వారంలోపు బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స (Cashless treatment) అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సౌకర్యం కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కింద పొందుపరిచిన చొప్పదండి, జగిత్యాల, మెదక్ తదితర జిల్లాల్లోని ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానుంది. ఈ పథకంతో బాధితులు ఆసుపత్రిలో వైద్యం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చుచేయాల్సిన అవసరం లేకుండా పోతుందని మంత్రి తెలిపారు.

ఆయుష్మాన్ భారత్ ఆసుపత్రుల్లోనే వర్తింపు

ఈ పథకం కింద నగదు రహిత వైద్యం ఆయుష్మాన్ భారత్‌ పథకానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించాల్సిందిగా, అలాగే ఈ-దార్ (e-DAR) పోర్టల్‌ లో వివరాలు నమోదు చేయాలని మంత్రి సూచించారు. సమాచారం నమోదైన వెంటనే బాధితులకు చికిత్స కోసం ప్రాసెస్ మొదలవుతుందని తెలిపారు. ఇందులో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు ఆసుపత్రులు కూడా భాగస్వాములవుతాయని చెప్పారు.

కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొన్నం

ఈ కీలక నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఇది నిజంగా ప్రజలకు అవసరమైన, ప్రాణాలను కాపాడగలిగే చొరవ అని కొనియాడారు. ఈ పథకంతో ప్రతి రోడ్డు ప్రమాద బాధితుడు సరైన సమయంలో మెరుగైన వైద్యం పొందగలడని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈ అంశంపై పోలీస్‌, వైద్య, రవాణా శాఖల మధ్య సమన్వయం పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

Read Also : Big Alert : వెంటనే అకౌంట్స్ పాస్ వర్డ్స్ మార్చుకోండి

accident cases Cashless treatment Google News in Telugu ponnam prabhakar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.