-సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు ఢిల్లీలో సిట్ అధికారులు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటివరకూ ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) ను సిట్ అధికారులు ఐదుసార్లు విచారించారు.
ప్రభాకర్ రావుకు రిలీఫ్ రద్దు
ఐదు సార్లు సుమారు నలభై గంటలపాటు ప్రభాకర్ రావును విచారించింది సిట్ (Sit). అయితే విచారణలో సమాధానాలు చెప్పకుండా అధికారుల సహనాన్ని పరీక్షించారు ఎస్ఐబీ మాజీ చీఫ్. ఈ క్రమంలో ప్రభాకర్ రావు (Prabhakar Rao) విచారణకు సహకరించకపోవడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లారు. పిటిషన్లో ప్రభాకర్ రావు మినహాయింపులు రద్దు చేయాలని కోరనున్నారు .
ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి?
ఫోన్ ట్యాపింగ్ అంటే ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి ఒకరి ఫోన్ సంభాషణలను రహస్యంగా వినడం . చాలా సందర్భాలలో ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధం
Read hindi news: hindi.vaartha.com
Read also: Kharif: గత యేడాది కంటే తగ్గిన ఖరీఫ్