📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

Canal Breach : సాగర్ ఎడమకాలువకు గండి – గేట్లు మూసివేసి నీళ్లు వదిలారు

Author Icon By Shravan
Updated: August 11, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఖమ్మం Canal Breach : నీటిపారుదల శాఖ (Irrigation Department) అధికారులు కళ్లు మూసుకున్నారు ఎడమకాలపై దించి ఉన్న గేట్లను ఎత్తకుండానే నీటిని విడుదల చేయడంతో ఒక్కసారిగా కాలువ గండిపడి వందలాది ఎకరాల్లో సాగులో ఉన్నవరి పంటకు నష్టం జరిగింది వేంసూరుమండలం కుంచపత్రి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ జలాశయం నిండిపోవడంతో పాలేరు రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు దీంతో పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని ఇటీవల సాగర్ ఎడమ ప్రధాన కాలువకు వదిలారు మంత్రులు అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కానీ అధికారులు నిరక్ష్యం వహించడం వలన కనీసం నీళ్ళు వదిలే సమయంలో కాలువలను పరిశీలించి ఎక్కడెక్కడ గేట్లున్నాయి వాటి పరిస్థితి ఏంది అనే విషయాన్ని కూడా పరిశీలించక పోవడంతో సాగర కాలువకు గండి పడింది ఈ సంఘటన పూర్తిగా ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యంగానే చెప్పుకోవచ్చు వరి నాట్లు వేసే సమయంలో ప్రధాన కాలువకు గండిపడటంతో ఈ ప్రాంతంలో రైతాంగం ఆందోళన చెందుతున్నారు అంతేగాక వందలాది ఎకరాల్లో వేసిన వరి పైరు కొట్టక పోయింది సత్వరమే గండిని పూడ్చి నీటిని తిరిగి విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుకుంటున్నారు అలాగే గత దశాబ్ద కాలంగా సాగరు ఎడమ ప్రధాన కాలువకు ఎలాంటి మరమత్తులు చేయలేదు.

దీంతో కాలువపై ఉన్న యూటలు మేజర్లు మైనర్లు ఆనవాళ్లు కోల్పోయి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి ప్రధాన కాలువ చెట్లు ముళ్లపొదలతో నిండిపోయిందిదీంతో కాలువల్లోనీరు సక్రమంగా ప్రవహించడం లేదు ఒకవైపు కాలువల పరిస్థితి ఇలా ఉంటే అధికారులు నీళ్లు వదిలి కళ్ళు మూసుకొని ఉండటంతో గండి పడింది నీళ్లు విడుదల (Water release) చేసే సమయంలో కాలువపై ఎక్కడెక్కడ మేజర్లు ఉన్నాయి ఎక్కడెక్కడ మైనర్లు ఉన్నాయి ఎక్కడెక్కడ లాక్కులు ఉన్నాయనే విషయాన్ని కూడా పరిశీలించకుండా విడుదల చేయటం అధికారుల నిరక్ష ్యం నిర్లక్ష్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు నీటిపారుదల అధికారులు ఇంతటి నిరక్ష ్యంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని కాలువకు తక్షణమేనీటిని విడుదల చేయాలని గండి పడిన కాల్వకు మరమ్మత్తులు పూర్తి చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/rythu-bima-verification-of-new-rythu-bima-passbooks-completed/telangana/528977/

Breaking News in Telugu Latest News in Telugu Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.