జూబ్లీహిల్స్(Jubilee Hills ) ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవడం ఖాయమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ కోసం చాలా మంది రేసులో ఉన్నారని తెలిపారు. సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ వంటి పలువురు నేతలు టికెట్ అడుగుతున్నారని, స్థానికులకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉందని ఆయన చెప్పారు. మంత్రుల కమిటీ, సర్వే ఫలితాల ఆధారంగానే ఈ విషయంలో తుది నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
OG: బాక్సాఫీస్ కు వొచ్చిన ‘ఓజీ’ సినిమాపై చిరంజీవి ఏమన్నారంటే?
హైడ్రా పనితీరు, పక్షపాతం లేని విచారణ
గతంలో కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని గుర్తుచేస్తూ, హైడ్రా(Hydra) సంస్థ పనితీరుపై కూడా ఆయన మాట్లాడారు. హైడ్రాతో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, కానీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పవని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లును కూలగొట్టడానికి కూడా హైడ్రా వెళ్లిందని, అయితే కోర్టు ఆర్డర్ తీసుకురావడంతో ఆగాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఎలాంటి పక్షపాతం లేకుండా హైడ్రా పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలైందని, మళ్లీ పునరుజ్జీవం పొందే అవకాశం లేదని విమర్శించారు.
టికెట్ రేసులో కొత్త పేర్లు
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ కోసం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్(Captain Azharuddin) తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, ఇటీవల ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ప్రకటించడంతో రేసు నుంచి తప్పుకున్నట్లు అయింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు విజయలక్ష్మి పేరు కూడా తెరపైకి వచ్చింది. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పోటీలో ఉన్నారని పీసీసీ చీఫ్ ప్రకటించడంతో, కాంగ్రెస్ హైకమాండ్ ఎవరి పేరును ఫైనల్ చేస్తుందనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టికెట్ కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారు?
సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ సహా పలువురు నేతలు టికెట్ అడుగుతున్నారు.
కాంగ్రెస్ టికెట్ కేటాయింపు ఎలా జరుగుతుంది?
మంత్రుల కమిటీ, సర్వే ఫలితాల ఆధారంగా తుది నిర్ణయం ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: