📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Bypoll : ఉపఎన్నికలు ఫిక్స్..కార్యకర్తలు సిద్ధం – కేటీఆర్

Author Icon By Sudheer
Updated: July 31, 2025 • 10:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత అంశం (Telangana BRS MLA Defection Case)పై సుప్రీంకోర్టు తీర్పుపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పును చారిత్రాత్మక తీర్పుగా ఆయన అభివర్ణించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సీజేఐకి ధన్యవాదాలు చెప్పిన కేటీఆర్ (KTR), కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని సుప్రీంకోర్టు నిరూపించిందని హర్షం వ్యక్తం చేశారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ‘పాంచ్ న్యాయం’ పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హత వర్తిస్తుందని చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్: ‘ఉపఎన్నికలకు సిద్ధం కావాలి’

రాహుల్ గాంధీకి నిజాయితీ ఉంటే తాను చెప్పిన నీతులకు కట్టుబడి ఉండాలని కేటీఆర్ సవాల్ విసిరారు. చట్టవిరుద్ధంగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పడానికి దర్యాప్తు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికకు 3 నెలల సమయం ఉందని, పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికలు ఖాయమని, వాటిని ఎదుర్కొనేందుకు బీఆర్‌ఎస్ సంసిద్ధంగా ఉందని ఆయన తన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ

ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏళ్ల తరబడి పిటిషన్లను పెండింగ్‌లో పెట్టడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. స్పీకర్ నిర్ణయం ఆధారంగా 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయా లేదా అన్నది స్పష్టమవుతుంది. కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ పార్టీ ఉపఎన్నికల కోసం మానసికంగా సిద్ధంగా ఉందని, వాటిని ఎదుర్కొనేందుకు ఆత్మవిశ్వాసంతో ఉందని తెలియజేస్తున్నాయి.

Read Also : Jagan : బాబు కాదు బావిలో దూకాల్సింది నువ్వే అంటూ జగన్ పై కోటంరెడ్డి ఫైర్

Google News in Telugu ktr Telangana BRS MLA Defection Case Telangana bypoll

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.