హైదరాబాద్ : ఈ నెల 2 నుంచి 19 వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రమాదకరమైన చట్టాలకు ఆమోదం తెలిపిందని సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు(BV Raghavulu) విమర్శించారు. లేబర్ కోచ్లతో ఉద్యోగ భద్రతకి భంగం వాటిట్లనుందని, శాంతి బిల్లు దేశానికి అత్యంత ప్రమాదకరమన్నారు. సిపిఎం తెలంగాణ(Telangana) రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్లో బివి రాఘవులు రాష్ట్ర కార్యదర్శి జానెవెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్త సభ్యులు, జూలకంటి రంగారెడ్డి, టి జ్యోతితో కలిసి మంగళవారం మీడియాతో మాట్లాడారు.
Read Also: TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?
ఈ సందర్భంగా బివి రాఘవులు మాట్లాడుతూ.. ఈ మధ్య ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో దేశానికే అత్యంత ప్రమాదకరమైన నాలుగు చట్టాలకు మోడీ సర్కారు(Modi Govt) ఆమోద ముద్ర వేసుకున్నదనీ, వాటి పరిణామాలు దేశ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించబోతున్నాయన్నారు. కార్పొరేట్లకు అధిక లాభాలు గడించేలా నాలుగు లేబర్ కోట్లను తీసుకురావడం దుర్మార్గ రాఘవులు మన్నారు. కోట్లతో కార్మికులు నమ్మె హక్కును కోల్పోతారనీ, ఉద్యోగ భద్రత ఉండదనీ, కనీస వేతనాల కోసం కార్మికులు వేరసారాలు ఆడే హక్కును కోల్పోతారని వివరించారు. ఈజ్రాఫ్ రూయింగ్ మెథడ్ అంటే కార్మికుల హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ విద్యుత్ పంపిణీ వ్యవస్థ 99 శాతం ప్రభుత్వ ఆధీనంలో నడివేదనీ, దాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే విద్యుత్ సవరణ చట్టాన్ని మోడీ సర్కారు చేసిందని విమర్శించారు.
ఈ చట్టం వల్ల క్రాస్ సబ్సిడీ ఎగిరిపోతుందనీ, రైతులు, పేదలు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కోల్పోతారని తెలిపారు. సబ్సిడీ మీద విద్యుత్ పొందుతున్న విద్యా సంస్థలు, ఆస్పత్రులు సౌకర్యాన్ని కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో మూడో డిస్కమ్ ఏర్పాటును రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. లాభాలు వచ్చే వాటిని ప్రయివేటు కంపెనీలకు అప్పగించి, నష్టాలు వచ్చే వాటిని ప్రభుత్వ ఆధీనంలో ఉంచి క్రమంగా ప్రజలకు సేవలను తగ్గించే కుట్ర దీని వెనుక ఉందని విమర్శించారు.
జీ రాం జీ చట్టం రాష్ట్రాలకు పెనుధారంగా మారబోతున్నదనీ, ఆర్ధిక ఇబ్బందులతో రాష్ట్రాలు 40 శాతం నిధులను ఖర్చుచేయకపోతే కేంద్రం ఇచ్చే 60 శాతం నిధులను ఆపేస్తుందని తెలిపారు. ఆ చట్టం ద్వారా దేశంలోనే ఎక్కువ పనిదినాలను వాడుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు. దీంతో గిరిజనులు, ఆదివాసీలు, దళితులు ఎక్కువ నష్టపోతారని చెప్పారు. నాబ్కా బీమా సబ్కా రక్ష కాదు… నటికి బీమా కరోడ్పతికారక్ష అనే ఇన్సూరెన్స్ చట్టంలో మార్పుటున్నాయనీ, విదేశీ సంస్థలకు ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతం పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని మోడీ సర్కారు కల్పించిందని రాఘవులు విమర్శించారు.
శాంతి పేరుతో తీసుకొస్తున్న న్యూక్లియర్ లయబులిటీ బిల్లు విదేశీ సంస్థలు కంపెనీలు స్థాపించే అవకాశాన్ని కలిస్తుందనీ, ప్రమాదాలు జరిగితే కంపెనీల బాధ్యత కాదని ఆ చట్టంలో పేర్కొనటం దేశానికే ప్రమాదకరమని బివి రాఘవులు మండిపడ్డారు. తెలంగాణలో సర్ ప్రక్రియ
ప్రారంభమైందనీ, త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని గ్యానేశ్ కుమార్ ప్రకటించారనీ, సర్ పేరుతో బీజేపీకి మేలు చేసే నిర్ణయాలను ఈసీ తీసుకుంటున్నదని విమర్శించారు. బీజేపీ చేతుల్లో ఈసీ పావుగా మారిండని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మాట్లాడుతూ… నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో వారంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆకాక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల అభివృద్ది కోసం అధిక నిధులు కేటాయిం చాలని కోరారు. ఓఆర్ఆర్ అవతలకు పరిశ్రమలను తరలించి భూములను పారిశ్రామికవేత్తలకే అప్పగించాలని చూడటం సరిగాచన్నారు. ఆ పేరుతో రూ.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రూ.5వేల కోట్లకే పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టబో తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) నేతను కిరాయి గుండాలతో హత్య చేయించిన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షి రాష్ట్ర ప్రభుత్వాన్ని జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: