Budget Session 2026: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పష్టత వచ్చింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సోమవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో సభను ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ సహా వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం, మార్చి 20న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
Read Also:Telangana Budget 2026: మార్చి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు
మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!
సమావేశాల వివరాల ప్రకారం.. మార్చి 17, 18 తేదీలలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. 19న ఉగాది, 21న రంజాన్, 27న శ్రీరామనవమి పండుగల దృష్ట్యా సభకు సెలవులు ప్రకటించారు. మార్చి 23 నుండి 26 వరకు బడ్జెట్‌పై సమగ్ర చర్చ కొనసాగుతుంది. అలాగే, మార్చి 28న వక్ఫ్ బోర్డు బిల్లు, మూసీ ప్రక్షాళన మరియు జీహెచ్‌ఎంసీ కొత్త చట్టంపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. చివరి రోజైన మార్చి 30న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించి సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు.
హౌస్ కమిటీలు వేయాలని కోరిన హరీష్ రావు
మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు సభను కనీసం మార్చి 31 వరకు నిర్వహించాలని డిమాండ్ చేశాయి. బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హౌస్ కమిటీల ఏర్పాటులో జాప్యం జరుగుతోందని, తక్షణమే వాటిని నియమించాలని కోరారు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అవకాశం ఇవ్వాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న ప్రివిలేజ్ మోషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ లైబ్రరీ దుస్థితిని కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా బడ్జెట్‌పై లోతైన చర్చ జరగాలని, ఇందుకోసం సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని కోరారు. గత బడ్జెట్ నిధుల కేటాయింపులు మరియు వాస్తవ వ్యయంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సభను ఉదయం 9 గంటలకే ప్రారంభించాలని మరియు డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో కోరాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: