BTech Student Death Medak: తెలంగాణ లోని, మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడవుతాడనుకున్న ఓ బీటెక్ విద్యార్థి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. పట్టణానికి చెందిన బిక్షపతి, హేమలత దంపతుల కుమారుడు కార్తీక్ (22) హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.
Read Also: Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం
ఏం జరిగిందంటే?
వారం రోజుల క్రితం కార్తీక్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కార్తీక్‌ను నిమ్స్ (NIMS) ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో పాటు ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: