📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Telugu news: BRS: ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య ఖూనీ: కేటీఆర్

Author Icon By Tejaswini Y
Updated: December 18, 2025 • 10:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజ్యాంగం చేతిలో పుస్తకమే.. ఆచరణలో గౌరవం లేదు

Telangana Politics: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడంపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపైన, దేశ అత్యున్నత న్యాయ స్థానాలపైన ఏమాత్రం గౌరవం లేదని ఈ ఘటనతో మరోసారి రుజువైందని కేటీఆర్ అన్నారు.

కేవలం రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఫొటోలకు ఫోజులిస్తే సరిపోదని ఎద్దేవా చేశారు. తన తండ్రి రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గౌరవించడంలో విఫలమైన అసమర్థ నేతగా రాహుల్ గాంధీ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు.

Read also: High Court: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అభ్యంతరాల గడువు పొడిగింపు

BRS: Speaker’s decision on defections is a killer of democracy: KTR

అభివృద్ధి కోసమే పార్టీ మారామని చెబుతున్న ఎమ్మెల్యేలను కాపాడటం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం ఉప ఎన్నికలకు భయపడే కాంగ్రెస్ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతోందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, త్వరలో జెడ్పిటీసీ, ఎంపిటీసీ ఎన్నికలు పార్టీ,
రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ భయపడుతోందని తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ జాప్యం వెనుక ఉన్న భయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుల్ని విస్మరించిన స్పీకర్ నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే స్పీకర్ ఫిరాయింపుల పిటిషన్లకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తిని విస్మరించి, స్థానిక కాంగ్రెస్ నాయకత్వం ఒత్తిడికి స్పీకర్ తలొగ్గడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో ఎమ్మెల్యేలను తాత్కాలికంగా కాపాడుకోవచ్చని, కానీ వారి నియోజకవర్గాల్లోని ప్రజలు ఇప్పటికే ప్రజాక్షేత్రంలో వారిపై అనర్హత వేటు వేశారని కేటీఆర్ పేర్కొన్నారు.

స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య స్పూర్తి, రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని పేర్కొన్నారు. ఉప ఎన్నికలకు భయపడే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పల్లెపల్లెనా ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోందని… పార్టీ మారిన వారిని ప్రజలు ఎప్పుడో అనర్హులుగా ప్రకటించేశారని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

brs congress party Disqualification Petition ktr MLA Defection Speaker Decision Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.