📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

Latest Telugu News: TG: రేవ్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ?..పోలీసుల అదుపులో 72 మంది

Author Icon By Vanipushpa
Updated: October 16, 2025 • 4:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నగరంలో రేవ్‌ పార్టీ(Rave Party)ల కల్చర్‌ రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌ సరిహద్దు ప్రాంతాల్లో విచ్చల విడిగా సాగుతోన్న రేవ్‌ పార్టీల ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం మహేశ్వరం పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టు(Chandra reddy resort) లో జరుగుతున్న రేవ్‌ పార్టీని ఎస్‌వోటీ బృందం, మహేశ్వరం పోలీసులు భగ్నం చేసిన విషయం మరిచిపోకముందే మరో పార్టీ వెలుగు చూసింది.

Read Also: Rahul Gandhi : ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారు : రాహుల్‌ గాంధీ

TG: రేవ్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ?..పోలీసుల అదుపులో 72 మంది

రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రేవ్ పార్టీ కలకలం రేపింది. లింగంపల్లి గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో అర్థరాత్రి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఫాం హౌస్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న రేవ్‌పార్టీని భగ్నం చేశారు. రేవ్‌పార్టీలో 25 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా రేవ్​ పార్టీ నిర్వహిస్తు్న్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్బంగా 2 లక్షల 40 వేల నగదు, 15 మొబైల్ ఫోన్లు, 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని మంచాల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

వాహనాల లోపల పార్టీ కండువాలు

కాగా పట్టుబడ్డ వాహనాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కి సంబంధించిన రెండు కార్లు ఉన్నట్లు సమాచారం. అయితే సదరు ఎమ్మెల్సీ స్టీకర్ ఉన్న వాహనాలను పోలీసులు కనపడకుండా దాచేస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. ఆ వాహనంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్టిక్కర్లు, వాహనాల లోపల పార్టీ కండువాలు కూడా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్టిక్కర్ కనిపించకుండా దానిపై వైట్ పేపర్‌ను పోలీసులు అతికించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వినవస్తు్న్నాయి.

పోలీసులు విచారణ

మరికొందరేమో ఎమ్మెల్సీకి డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి పార్టీకి వచ్చి ఇరుక్కుపోయినట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై సదరు ఎమ్మెల్సీ స్పందిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కాగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌ పరిసరాల్లో తరచూ రేవ్ పార్టీ ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మహేశ్వరం పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టులో మరో రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. అర్థరాత్రి జరుగుతున్న రేవ్‌ పార్టీపై ఎస్‌వోటీ బృందం, మహేశ్వరం పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీనిలో 72 మంది పోలీసుల అదుపులో ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also :

brs mlc Drug bust Hyderabad News Law Enforcement Police Raid Political Controversy Rave Party Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.