తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. పార్టీలో నుంచి ఇతర పార్టీలకు వెళ్లిపోయిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు (Disqualification) వేయాలంటూ వారు నినాదాలు చేశారు.
ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారిపై స్పీకర్ తక్షణ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ సభ్యులు (BRS MLAs) గట్టిగా డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) వెంటనే స్పందించాలని కోరారు. ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం అనర్హత చర్యలపై ఆలస్యం అనవసరం అని వారు అభిప్రాయపడ్డారు. శాసనసభ సభ్యులు నేరుగా స్పీకర్ కార్యాలయం దిశగా వెళ్లారు. అయితే, ఆ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కార్యాలయంలో లేకపోవడంతో ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. అక్కడే గాంధీ విగ్రహం ఎదుట కూర్చుని శాంతియుతంగా తమ అభ్యంతరాన్ని వ్యక్తపరిచారు.
వినతిపత్రాన్ని సమర్పించిన బీఆర్ఎస్ నేతలు
తమ డిమాండ్లను అధికారికంగా తెలియజేయడానికి బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేగంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: