📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

Author Icon By Sudheer
Updated: June 21, 2025 • 7:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)ని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్టు (Padi Kaushik Reddy Arrest) చేశారు. ఆయనపై భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్) కింద 308(2), 308(4), 352 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. అనంతరం విచారణ నిమిత్తం ఆయన్ను వరంగల్‌కి తరలించారు.

క్వారీ యజమానిపై బెదిరింపు ఆరోపణలు

వివరాల్లోకి వెళితే… కమలాపురం మండలం వంగపల్లిలోని గ్రానైట్ క్వారీ యజమాని కుటుంబం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. కౌశిక్ రెడ్డి రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును ఆధారంగా తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కౌశిక్ రెడ్డి ఏప్రిల్‌లో కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, జూన్ 16న కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.

కోర్టు తీర్పు అనంతరం అరెస్ట్

కోర్టు తన పిటిషన్‌ను కొట్టివేయడంతో పోలీసులు వెంటనే చర్యలకు దిగారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ అరెస్ట్‌ను పిలుపుతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి ఇది మరొక దెబ్బగా భావిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై అధికార, విపక్ష పార్టీల మధ్య రాజకీయ దుమారం రేగే అవకాశముంది.

Read Also : Yoga Day 2025 : అంతర్జాతీయ యోగా డే వేడుకలకు 11 ఏళ్లు

BRS MLA Google News in Telugu Padi Kaushik Reddy Padi Kaushik Reddy Arrest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.