📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Maganti Gopinath : బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇకలేరు

Author Icon By Sudheer
Updated: June 8, 2025 • 7:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్‌ఎస్‌ పార్టీ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (Maganti Gopinath ) (62) ఆదివారం ఉదయం 5.45కి తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఈ నెల 5న ఛాతీ నొప్పితో హుటాహుటిన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి(AIG)లో చేరారు. కార్డియాక్ అరెస్టు తర్వాత సీపీఆర్‌ నిర్వహించడంతో గుండె తిరిగి కొట్టినా, అపస్మారక స్థితి నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారు. మూడు రోజుల పాటు చికిత్స పొందిన గోపీనాథ్‌ ఆరోగ్యం విషమించడంతో ఆదివారం ఉదయం (Maganti Gopinath Died) ఆయన మరణించారు.

జూబ్లీహిల్స్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యే

మాగంటి గోపీనాథ్‌ రాజకీయ జీవితం విషయానికి వస్తే.. 1985 నుండి 1992 వరకు తెలుగు యవత రాష్ట్రాధ్యక్షుడిగా పని చేసిన ఆయన, 2014లో తొలిసారిగా టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఆయన, 2018లో కాంగ్రెస్ అభ్యర్థి పీ. విష్ణువర్ధన్ రెడ్డిపై విజయం సాధించారు. ఇటీవల జరిగిన 2023 ఎన్నికల్లో మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. మజ్లిస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులపై వరుసగా విజయాలు సాధించిన మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ప్రజల మన్ననలు పొందారు.

బీఆర్ఎస్‌లో మాగంటి గోపీనాథ్‌కు ప్రత్యేక స్థానం

బీఆర్ఎస్‌లో మాగంటి గోపీనాథ్‌కు ప్రత్యేక స్థానం ఏర్పడింది. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, హైదరాబాద్ నగర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన ఆయన, బీఆర్‌ఎస్ జెండాను జూబ్లీహిల్స్‌లో గర్వంగా రెపరెపలాడించారు. మాగంటి గోపీనాథ్ మృతి రాష్ట్ర రాజకీయ రంగానికే కాదు, జూబ్లీహిల్స్ ప్రజలకు పెద్ద లోటు అని నాయకులు అభిప్రాయపడుతున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Fish Prasadam Distribution : నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ

BRS MLA maganti gopinath Google News in Telugu Jubilee Hills mla Maganti Gopinath Maganti Gopinath Died

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.