తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఆర్థిక స్థితిలో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీకి వచ్చే విరాళాల పరంగా పడిపోయిన గణాంకాలు దీనికి నిదర్శనం. తాజాగా ఎన్నికల సంఘానికి (EC) సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో BRS కేవలం రూ.15.09 కోట్లు మాత్రమే విరాళాల రూపంలో పొందింది. దీనిలోనూ ప్రధానంగా కార్పొరేట్ నిధులే కీలకం అని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.
Breaking News – Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధరలు!
ఈ విరాళాల్లో ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ.10 కోట్లు, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ.5 కోట్ల విరాళం రావడం గమనార్హం. వీటితో పాటు ఇతర చిన్న సహాయాలు ఉన్నప్పటికీ, మొత్తం మొత్తాలు పరిశీలిస్తే ఇది చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి విరాళాల ప్రవాహం బలంగా ఉండగా, ఇప్పుడు మాత్రం పార్టీ ఫండింగ్ గణనీయంగా క్షీణించడం రాజకీయ గతినే సూచిస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా నిలిచింది. ఆ సమయంలో BRS పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.580.52 కోట్లు విరాళాలు అందాయి. ప్రస్తుత సంవత్సరం కేవలం రూ.15.09 కోట్లకు పరిమితమవడంతో విరాళాల్లో 97.4% తగ్గుదల చోటుచేసుకుంది. ప్రస్తుతం ప్రజల విశ్వాసం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా పార్టీ బలహీనపడుతున్న సంకేతాలు ఇవని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఎలా బలోపేతం చేసుకుంటుందో చూడాలి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/