ప్రియురాలి త‌ల్లిపై దాడి చేసిన ప్రియుడు

Read Time:  1 min
boy friend attack
boy friend attack
FONT SIZE
GET APP

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం సుద్దాలపల్లి గ్రామంలో ఒక యువకుడు తన ప్రియురాలి తల్లిపై దారుణంగా దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమకు అడ్డుగా నిలిచిందనే ఆగ్రహంతో ప్రియుడు తన ప్రియురాలి తల్లిని గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

KMG

కొంతకాలంగా ప్రేమలో ఉన్న సుష్మిత

సుద్దాలపల్లి గ్రామానికి చెందిన దూట రాజ్‌కుమార్, జాడి సుష్మిత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే, సుష్మిత తల్లి ఈ ప్రేమను వ్యతిరేకిస్తూ ఆమెను మందలించింది. పక్షవాతం వల్ల మంచం పట్టిన తండ్రి బాధను గుర్తుచేస్తూ, కుటుంబ భవిష్యత్తుపై ఆలోచించాలని సూచించింది. దీంతో తన ప్రేమకు తల్లే అడ్డుగా మారిందని భావించిన రాజ్‌కుమార్, సుష్మిత ఇంటికి వెళ్లి ఆమె తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు.

గాయపడిన సుష్మిత తల్లి

తీవ్రంగా గాయపడిన సుష్మిత తల్లిని అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు రక్షించి, ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పేరుతో ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడడాన్ని అందరూ ఖండిస్తున్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.