📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bomb Threat: తెలంగాణ హైకోర్టుకు బాంబు బెదిరింపు

Author Icon By Tejaswini Y
Updated: February 25, 2026 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bomb Threat: భాగ్యనగరంలోని కీలక న్యాయస్థానాలకు బుధవారం బాంబు బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. తెలంగాణ హైకోర్టుతో పాటు నాంపల్లిలోని సీబీఐ కోర్టును పేల్చివేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ పోలీసు యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించాయి.

Read Also: Malla Reddy-Supreme Court: సుప్రీంకోర్టులో మల్లారెడ్డికి చుక్కెదురు

Bomb Threat: Bomb threat to Telangana High Court

హైకోర్టులో ముమ్మర తనిఖీలు

తెలంగాణ హైకోర్టుకు బెదిరింపు కాల్ అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా సిబ్బందితో పాటు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (Bomb Squad) మరియు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. కోర్టు ప్రాంగణం, పార్కింగ్ ఏరియా, మరియు న్యాయమూర్తుల ఛాంబర్లతో సహా ప్రతి మూలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా కోర్టు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

సీబీఐ కోర్టుకు కూడా..

అటు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు కూడా ఇదే తరహాలో బెదిరింపులు రావడంతో అక్కడ కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఒకే సమయంలో రెండు కీలక కోర్టులకు బెదిరింపులు రావడంతో పోలీసులు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bomb Squad Searches Bomb Threat Bomb Threat Hyderabad Hyderabad Police Alert Nampally CBI Court Telangana High Court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.