హైదరాబాద్ (Hyderabad) లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి బాంబు బెదిరింపుతో ఉలిక్కిపడింది. ఆదివారం ఉదయం సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానంలో బాంబు పెట్టినట్లు మెయిల్ ద్వారా బెదిరింపు అందడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే ప్రయాణికులను కిందకు దింపి, తనిఖీలు చేపట్టగా, బాంబు లభ్యం కాలేదు.
Read Also: Medchal: తగినంత ఓట్లు రాలేదని ఇచ్చిన చీరలు వెనక్కి కోరిన అభ్యర్థి
నకిలీ బాంబు బెదిరింపు కాల్స్
దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ రెండు నెలల వ్యవధిలో శంషాబాద్ విమానాశ్రయానికి 23 నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కొన్ని ఫోన్ కాల్స్ విదేశాల నుంచి వచ్చినట్లు కూడా గుర్తించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: