📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: BRS- కవిత ఇంటికి వెళ్లిన కేసిఆర్ భార్య శోభ

Author Icon By Pooja
Updated: September 12, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

BRS- ఎమ్మెల్సీ కవిత ఇంటికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సతీమణి శోభ బుధవారం రాత్రి వెళ్లారు. ఆమె అల్లుడు, కవిత భర్త అనిల్ పుట్టినరోజు వేడుకలకు(Birthday Celebrations) హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభ, తన కూతురు కవితకు కొద్ది రోజులు శాంతంగా ఉండాలని, పరిస్థితులు సర్దుకుంటాయని భరోసా ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కుటుంబంలో విభేదాలు ఉధృతమవుతున్న తరుణంలో శోభ ఈ సందర్శన రాజకీయ చర్చనీయాంశమైంది.

కవిత కుమారుడి పుట్టినరోజు వేడుకలకు ఈ ఏడాది శోభ హాజరుకాలేదు. సాధారణంగా ఈ సందర్భంలో సత్యనారాయణ వ్రతం కుటుంబ సభ్యులందరితో కలిసి నిర్వహిస్తారు. కానీ ఈసారి కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ కార్యక్రమం జరగలేదు. కవిత ఆహ్వానించినప్పటికీ తల్లి రాకపోవడంతో, కొత్త బట్టలు, పూజా సామగ్రి మాత్రమే పంపినట్లు సమాచారం.

కవితపై తాజా రాజకీయ పరిణామాలు

ఇటీవల కవిత, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుపై అవినీతి ఆరోపణలు చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యల తర్వాత కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం కవిత బీఆర్ఎస్ సభ్యత్వం, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. అయితే తాను కొత్త పార్టీ స్థాపనపై వస్తున్న వార్తలను ఖండించింది. భవిష్యత్తు నిర్ణయంపై జాగృతి కార్యకర్తలు, మేధావులతో చర్చించి ముందడుగు వేస్తానని వెల్లడించింది.

తిరిగి బీఆర్ఎస్‌లోకి?

కవిత రాజీనామా(Resignation) చేసినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో ఆమె తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశాలపై ఊహాగానాలు బలపడుతున్నాయి. ఈ పరిణామాలపై అందరి చూపు నిలిచింది.

శోభ కవిత ఇంటికి ఎందుకు వెళ్లారు?
కవిత భర్త అనిల్ పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు.

కవిత కుమారుడి పుట్టినరోజుకు శోభ ఎందుకు రాలేదు?
కుటుంబ పరిస్థితుల నడుమ ఆమె గైర్హాజరు కాగా, బహుమతులు, పూజా సామగ్రి మాత్రం పంపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

Bomb-ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపుల కలకలం

Anil birthday celebrations BRS internal conflicts Google News in Telugu Kavitha political news Kavitha Resignation KCR wife Shobha Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.