📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

ఢిల్లీలో బీజేపీ గెలుపు..తెలంగాణ లో కేటీఆర్ సంబరాలు – మంత్రి పొన్నం

Author Icon By Sudheer
Updated: February 8, 2025 • 6:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ లో బీజేపీ విజయం సాధించడం తో కేటీఆర్ సంబరాలు చేసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సారి ఢిల్లీ ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి. గెలుపు కోసం ఆప్, బీజేపీ రెండు గట్టిగా ట్రై చేసాయి. ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో..బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఢిల్లీని చుట్టేశారు. మరోవైపు ఆప్ నుంచి కూడా కేజ్రీవాల్ తన శక్తినంతా ఒడ్డి..గెలుపు కోసం ప్రయత్నించారు. చివరి వరకు గట్టి పోటీయే ఇచ్చిన ఆప్.. చెప్పుకోదగ్గ సీట్లు సాధించి ప్రతిపక్షానికి పరిమితమైంది. తమకు డబల్ ఇంజిన్ సర్కారే కావాలంటూ.. ఢిల్లీ ప్రజలు కమలానికే అధికార పీఠం కట్ట పెట్టారు. దీంతో 27 ఏళ్ల తర్వాత.. ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ విజయం తో బిజెపి సంబరాలు చేసుకుంటుంది. కేవలం బిజెపి మాత్రమే కాదు బిఆర్ఎస్ కూడా సంబరాలు చేసుకుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

ఢిల్లీ ఫలితాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపే KTRకు చాలా ఆనందం కలిగిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేసుల నుంచి విముక్తి పొందాలని బీజేపీ భజన చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని ఏలుతామని పార్టీ పేరు మార్చుకున్న బీఆర్ఎస్ ఢిల్లీ ఎన్నికల సమయంలో ఎక్కడికి పోయిందన్నారు. మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే బీఆర్ఎస్ నాయకులు శునకానందం పొందారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో 27 ఏళ్లుగా పవర్ లెస్‌గా ఉన్న బిజెపి..ప్రచారం చివరి రోజు ఏకంగా 22 రోడ్ షోలు నిర్వహించింది. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టినా ఢిల్లీ అసెంబ్లీలో ఎందుకు పట్టు సాధించలేకపోతున్నామన్న ఆలోచన బీజేపీలో కనిపించింది. అందుకే ఈసారి ఢిల్లీ పీఠం ఎక్కాల్సిందేనన్న కసి కాషాయదళంలో పెరిగింది. కేజ్రీవాల్ టార్గెట్‌గా ప్రధాని మోడీ దగ్గర్నుంచి కేంద్రమంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంల దాకా ప్రచారాన్ని హోరెత్తించారు. మొత్తం మీద 27 ఏళ్ల తర్వాత విజయం సాధించి ఢిల్లీ కమలదే అనిపించారు.

Delhi Elections ktr ponnam prabakar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.