📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

BJP Suspend action: 13మందిపై బిజెపి వేటు

Author Icon By Tejaswini Y
Updated: February 10, 2026 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

BJP Suspend action : మున్సి పల్ ఎన్నికల్లో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిపై బీజేపీ వేటు వేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నందున రాష్ట్ర క్రమశిక్షణ సంఘం పలువురిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణా కమిటీ నిర్ణయానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు ఒకే చెప్పా రు. దీంతో సోమవారం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న వారిని పార్టీ నుండి బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సస్పెండ్ చేసింది.

Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

BJP Suspend action: BJP suspends 13 people

జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో 13 మందిపై

జగిత్యాల మున్సిపాలిటీలో సాంబారి కళావతి, అరవ లక్ష్మి, ముద్దం రాము, రావతి రాజు, కొక్కుల ధర్మేంద్ర, సిరికొండ భారతి, పులి శ్రీధర్… మెట్పల్లిలో మరిసంద కిశోర్, ఆర్మూర్ ప్రశాంత్, బొండ్ల నరేష్, కోరుట్లనుంచి ఇందూరి సత్యం, అయిలాపూర్ పద్మ, తోట రాజేశంను సస్పెండ్ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలుల్లోకి వస్తాయని బీజేపీ(BJP) క్రమశిక్షణా కమిటీ స్పష్టంచేసింది. సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడిన సోమవారం నుండి వారం రోజులోపు వేటుపడిన వారంతా తమ ప్రవర్తనపై రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాలని రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BJP Disciplinary Action BJP Telangana Jagtial Municipal Polls Municipal Elections 2026 Rebel Candidates Suspension

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.