Ramchandar Rao: తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బాధితులను పరామర్శించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కామారెడ్డి, బాన్సువాడ పర్యటనకు ఆయన సిద్ధమవుతున్న సమయంలో ఇంటివద్దే నిర్బంధించారు. శనివారం కామారెడ్డిలో భూవివాదానికి సంబంధించిన ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భూకబ్జా ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైంది.
Read Also: March Holidays: మార్చి నెలలో వరుస సెలవుల జాబితా
బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం
ఈ ఆరోపణలను నిరూపించాలంటూ ఎమ్మెల్యే సవాల్ విసరడంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నిరసనలకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు చేరుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నేత కారును ధ్వంసం చేసి, దాడికి పాల్పడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, లాఠీఛార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు.
ఇరువర్గాలకు చెందిన పలువురిని అరెస్టు చేయడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రామచందర్ రావు పర్యటన ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని భావించిన పోలీసులు, ఆయన ను, హైదరాబాద్‌లోనే హౌస్ అరెస్టు చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: