కోదాడ మేధావుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు(BJP Telangana State President) రాంచందర్ రావు(Ramchandar Rao) మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ(Narendra Modi) గారి నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. అన్ని రంగాల్లో పురోగతిని ఆయన వివరించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ సూత్రంతో మోదీ ప్రభుత్వం ప్రజల మౌలిక అవసరాలను తీర్చడమే కాకుండా, భారతదేశాన్ని గ్లోబల్ శక్తిగా నిలబెట్టిందని వివరించారు.
తెలంగాణలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పూర్తిగా అవినీతి, అక్రమాల పాలనగా నిలిచిందని, అయితే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేక అవినీతి కేసులు ఇంకా విచారణలో ముందుకు వెళ్లకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఎద్దేవా చేశారు.
ఓట్ల కోసమే ఇచ్చిన దొంగ వాగ్దానాలు
కాంగ్రెసు అధికారం లోకి వచ్చిన తరువాత కూడా ఈ కేసులపై విచారణ సరిగా జరగకపోవడం ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందాన్ని సూచిస్తోందని స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు కేవలం ఓట్ల కోసమే ఇచ్చిన దొంగ వాగ్దానాలని విమర్శించారు. ఏడాదిన్నర పాలన గడిచినా గ్యారంటీల అమలులో ఏమాత్రం శ్రద్ధ లేదని, ఒకవైపు హామీలను విస్మరిస్తూ, మరోవైపు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతూ, ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.
తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా..
రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పిలుపునిచ్చారు. ఈ దిశగా మేధావులు తమ విజ్ఞానం, సామర్థ్యంతో సమాజాన్ని చైతన్యపరిచే భాద్యతను భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చారు. బిజెపి అధికారంలోకి రావాలంటే మేధావుల చైతన్యం, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి కీలకమని స్పష్టం చేశారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Telangana: తొక్కిసలాట జరగకుండా తెలంగాణ పోలీసుల వినూత్న ఆలోచన